Uganda Online Prostitution Racket: దేశంలో ఉంటున్నదే అక్రమం.. ఆపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు.. ఎట్టకేలకు పోలీసుల దాడిలో బయటపడ్డ అసలు భాగోతం. హైదరాబాద్ మహానగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ విదేశీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆన్‌లైన్ వేదికగా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాకు చెందిన ఐదుగురు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజిటింగ్ వీసాపై వచ్చిన అమ్మాయిలతో ఈ దందా నడుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు మత్తు మందు విక్రయాలకు పాల్పడ్డుతున్నట్లు పోలీసులు తేల్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసులు ఉగాండాకు చెందిన ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. సంఘటనా స్థలం నుండి 20 గ్రాముల కెటామైన్‌తో పాటు ఇతర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. లోకాంటో డేటింగ్ యాప్ ద్వారా నిందితులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ సిబ్బంది శుక్రవారం దాడి చేశారు. డేటింగ్ యాప్‌ను ఏర్పాటు చేసుకుని అందులో వారి ఫోన్ నంబర్లతో పాటు మహిళల చిత్రాలను అప్‌లోడ్ చేశారు. పోలీసులు ట్రాక్ చేయకుండా ఉండటానికి ఈ-వాలెట్ల ద్వారా వినియోగదారుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు.
నిందితులు విజిటింగ్ వీసాలపై భారత్‌కు వచ్చారు. వీసాల గడువు ముగియడంతో అక్రమ వ్యాపారానికి తెరతీశారు. వీరిలో మిల్లీ అనే మహిళ గతేడాది డిసెంబర్‌లో ముంబై వచ్చింది. అక్కడినుంచి మార్చిలో హైదరాబాద్‌కు మకాం మార్చింది. మెహిదీపట్నం ఏరియా టోలిచౌకి ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని నివసిస్తుంది. ఈమె అనారోగ్యంతో బాధపడుతుందని చికిత్స కూడా తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో ఉగాండా నుండి యువతులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. వ్యభిచారం కూపంలోక దింపుతోంది. ఆన్‌లైన్ ద్వారా డబ్బులు తీసుకుని విటులు కోరుకున్న చోటుకి యువతులను పంపుతోంది. యువతులను విటుల వద్దకు తీసుకెళ్లేందుకు కొంత మంది వ్యక్తులను నియమించుకున్నారు.
అంతేకాదు అవసరమైన వ్యక్తులు కెటామైన్‌తో పాటు ఇతర డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఐదుగరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.