అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. బంగారం, వెండి అభరణాలు స్వాధీనం

అంతరాష్ట్ర దొంగల ముఠాను, ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న మరో ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. సలీం అలీ, మహ్మద్‌ సాదిక్‌, కుర్భాన్‌అలీ ముఠా సభ్యులను ముగ్గురిని

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. బంగారం, వెండి అభరణాలు స్వాధీనం

Updated on: Feb 19, 2021 | 7:16 PM

అంతరాష్ట్ర దొంగల ముఠాను, ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న మరో ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. సలీం అలీ, మహ్మద్‌ సాదిక్‌, కుర్భాన్‌అలీ ముఠా సభ్యులను ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు గులాం రాజా, అజీజ్‌ అలీ పరారీలో ఉన్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ముఠా సభ్యులకు శిక్షణ ఇస్తున్న సలీం ప్రధాన నిందితుడని తెలిపారు. ఇతడిపై 15 నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు. నిందితుల నుంచి 290 గ్రాముల బంగారం అభరణాలు, 217 గ్రాముల వెండి అభరణాలు, 3 బైక్‌కు, 2 ఎల్‌ఈడీ టీవీలను స్వాధీనం చేసుకున్నట్లు అంజనీకుమార్‌ తెలిపారు.

కాగా, నగరంలో దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు పని చేస్తున్నాయని అన్నారు. అంతర్‌రాష్ట్రాల నుంచి దొంగల ముఠా నగరంతో పాటు ఇతర జిల్లాల్లో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇప్పటికే అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాలను అరెస్టు చేశామని, తాజాగా మరో రెండు ముఠాలను అరెస్టు చేశామని అన్నారు. వారు ఎక్కడెక్కడ చోరీలక పాల్పడ్డారో విచారణలో తేలుస్తామన్నారు.

Also Read: బోయిన్‌పల్లిలో విషాదం… ఎమ్మెస్‌కి ప్రిపేర్ అవుతున్న మెడికో… అంతలోనే అనంతలోకాలకు పయనం..