ఐఏఎస్, ఐపీఎస్‌ల పేరుతో నకిలీ ఖాతాలు.. చివరికి ఏం చేశాడంటే..?

| Edited By:

Oct 05, 2019 | 2:04 PM

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని.. కొందరు సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఉన్నత చదువులు చదువుకుని.. ఉద్యోగాలు రాని కొందరు ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన మన్మోహన్ రావు.. సివిల్స్ లక్ష్యంగా హైదరాబాద్‌కు వచ్చాడు. ఎన్ని పరీక్షలు రాసినా.. ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెందిన అతడు సైబర్ నేరాలకు అలవాటు పడ్డాడు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే టార్గెట్‌గా వారి పేర్ల మీద ఫేస్ బుక్ […]

ఐఏఎస్, ఐపీఎస్‌ల పేరుతో నకిలీ ఖాతాలు.. చివరికి ఏం చేశాడంటే..?
Follow us on

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని.. కొందరు సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఉన్నత చదువులు చదువుకుని.. ఉద్యోగాలు రాని కొందరు ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన మన్మోహన్ రావు.. సివిల్స్ లక్ష్యంగా హైదరాబాద్‌కు వచ్చాడు. ఎన్ని పరీక్షలు రాసినా.. ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెందిన అతడు సైబర్ నేరాలకు అలవాటు పడ్డాడు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే టార్గెట్‌గా వారి పేర్ల మీద ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి పైశాచికం ప్రదర్శించాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న 54 మంది మహిళా ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లతో ఖాతాలు తెరిచాడు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో అసభ్య పోస్టులు పెట్టడం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న అధికారిణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆ అకౌంట్లను తొలగించింది. అయితే తరువాత కూడా మన్మోహన్ రావు అకౌంట్లు క్రియేట్ చేయడం ఆపలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మన్మోహన్ రావును అరెస్టు చేశారు. అతడి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు, కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తామని అదనపు డీసీపీ రఘువీర్ తెలిపినట్లు సమాచారం.