Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Chowdary: కిలాడీ లేడీ శిల్పా మోసాల చిట్టా చాంతాడంత పెద్దదే.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

రోజుకో డ్రామా...గంటకో మాట.. చేసిందంతా చేసి.. నాకేం తెలయదంటూ కిలాడీ లేడీ శిల్పా చౌదరి పోలీసుల ఎదుట బోరున విలపించింది.

Shilpa Chowdary: కిలాడీ లేడీ శిల్పా మోసాల చిట్టా చాంతాడంత పెద్దదే.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Shilpa Chowdary
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 04, 2021 | 4:03 PM

రోజుకో డ్రామా…గంటకో మాట.. చేసిందంతా చేసి.. నాకేం తెలయదంటూ పోలీసుల ఎదుట బోరున విలపించింది కిలాడీ లేడీ శిల్పా చౌదరి. జరిగి మోసాల చిట్టాపై ప్రశ్నిస్తుండగా తనకేం తెలియదంటూ దాటవేసే ప్రయత్నం చేసింది. పోలీసులు తమకు వచ్చిన ఫిర్యాదుల చిట్టాను.. ఆమె కోట్లు వసూలు చేసినట్లు ఆధారాలను ముందు పెట్టారు. ఏం చేయాలో…ఏం చెప్పాలో తెలియక కంట తడి పెట్టింది.

నేను ఎవరినీ మోసం చేయలేదు.. ఆరుగురి దగ్గర మాత్రమే డబ్బులు తీసుకున్నానని, అలా తీసుకున్న డబ్బు రియల్‌ ఎస్టేట్‌ వాళ్లకి ఇచ్చానని విచారణలో వెల్లడించింది. పెట్టుబడులు పెట్టిన చోట వాళ్లు తిరిగి ఇవ్వలేదన్న శిల్ప…అందుకే తీసుకున్న వాళ్లకు తిరిగి ఇవ్వలేకపోయానంటోంది. అంతేకాదు పెట్టుబడులు పెట్టమని కొందరు బ్లాక్‌మనీ కూడా ఇచ్చారని చెబుతోంది. డబ్బులు ఇవ్వకుండా సింగపూర్ వెళ్తున్నాననడం అవాస్తవమని, తాను ఎక్కడికీ పారిపోనని చెబుతోంది. తీసుకున్న అందరి డబ్బులు తిరిగి చెల్లిస్తానని పోలీసుల విచారణలో వెల్లడించింది. రియల్‌ ఎస్టేట్‌, సినిమా, ఆస్పత్రుల నిర్మాణాల్లో పెట్టుబడులుపెట్టి రొటేట్ చేసుకోలేకపోయాని కన్నీరు పెడుతోంది.

పోలీసుల చేతిలో శిల్పా కాల్ డేటా..

కోట్ల రూపాయల ఆర్థిక మోసంలో అరెస్టయిన శిల్పను పోలీసు తమదైన స్టయిల్‌లో విచారిస్తున్నారు. నార్సింగి ఇన్ స్పెక్టర్, అదనపు ఇన్స్ పెక్టర్, మహిళా పోలీసుల సమక్షంలో ఆమెను విచారించారు. కాలే డేటా రికార్డులు, ఎవరితో ఎప్పుడు? ఎంతసేపు మాట్లాడారనే చిట్టాను బయటకు తీశారు.

శిల్పా చౌదరి ఇంట్లో తనిఖీలు..

శిల్పా చౌదరి ఘరానా మోసాల గుట్టు రట్టు చేసే పని కొనసాగిస్తున్న పోలీసులు.. ఆమె ఇంట్లో  తనిఖీలు చేపట్టారు. శిల్పా చౌదరిని తీసుకెళ్లి ఆమె ఇంట్లో పోలీసుల సోదాలు చేశారు. ఇంట్లోని లాకర్లను ఓపెన్‌ చేయించిన పోలీసులు ఇంట్లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తవ్వేకొద్దీ శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

పోలీసులు ముందు నోర విప్పిన శిల్పా చౌదరి.. రాధికా రెడ్డి అనే రియల్టర్ తనను మోసం చేసిందని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. శిల్ప ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా రియల్ ఎస్టేట్ తో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ నడుపుతున్న రాధికా రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. తన దగ్గర ఆరు రూపాయల వడ్డీకి ఆరు కోట్లు రాధికారెడ్డి తీసుకుందని విచారణలో శిల్పా చౌదరి వెల్లడించింది.

Shilpa Chowdhury

Shilpa Chowdhury

కిట్టి పార్టీల పేరుతో సినీ,రాజకీయ ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన శిల్పా చౌదరికి న్యాయస్థానం షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే శిల్పా చౌదరి భర్తకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. దీంతో శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీకి తీసుకు విచారిస్తున్నారు.

Also Read..

Rachamallu: ఆమె అనుమతిస్తే కన్నీళ్లతో కాళ్లు కడుగుతాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు..

Whatsapp Cashback: వాట్సాప్ అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయి పంపినా రూ.51 క్యాష్ బ్యాక్