Hyderabad Girl Rape: బంధుత్వాలు మరచి నీచానికి పాల్పడ్డ దుర్మార్గుడు.. టీవీ చూసేందుకు వచ్చిన బాలిక‌పై పెద్దనాన్న అఘాయిత్యం..!

|

May 31, 2021 | 5:13 PM

హైదరాబాద్ మహానగరంలో సభ్య సమాజం తలదించుకునే దారుణం చోటుచేసుకుంది. వావీవరసలు మర్చిన ఓ మానవ మృగం..కూతురు వరసయ్యే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Hyderabad Girl Rape: బంధుత్వాలు మరచి నీచానికి పాల్పడ్డ దుర్మార్గుడు.. టీవీ చూసేందుకు వచ్చిన బాలిక‌పై పెద్దనాన్న అఘాయిత్యం..!
Follow us on

Man Raped Impregnates Minor Girl: హైదరాబాద్ మహానగరంలో సభ్య సమాజం తలదించుకునే దారుణం చోటుచేసుకుంది. వావీవరసలు మర్చిన ఓ మానవ మృగం..కూతురు వరసయ్యే బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అమానుషానికి తెగబడ్డాడు. ఆర్నెళ్లుగా ఆమెపై పశువాంఛలు తీర్చుకుంటున్నాడు.

బంధాలు బంధుత్వాలు మరచి నీచానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. కూతురు వరసయ్యే పదమూడేళ్ల బాలికపై కన్నేశాడు. టీవీ చూసేందుకు వచ్చిన బాలికపై అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. అభంశుభం తెలియని చిన్నారిపై పశువాంఛలు తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆర్నెళ్ల తర్వాత బాలికకు కడుపులో నొప్పి రావడంతో అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలిక ఆర్నెళ్ల గర్భంతో ఉందని తెలియడంతో తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. ఈ అత్యంత అమానుష ఘటన హైదరాబాద్ మహా నగరంలో వెలుగుచూసింది.

జగద్గిరిగుట్ట పరిధిలోని కూన మహాలక్ష్మినగర్‌‌కి చెందిన బాలిక(13) టీవీ చూసేందుకు గతేడాది అక్టోబర్‌లో సమీపంలోని పెదనాన్న వరసయ్యే వ్యక్తి ఇంటికి వెళ్లింది. మరదలి కూతురిపై కన్నేసిన పెదనాన్న ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యంత అమానుషంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించి పలుమార్లు ఆమెపై పశువాంఛలు తీర్చుకున్నాడు.

తీరా ఈ నెల 24న బాలిక అస్వస్థతకు గురైంది. కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు కంగుతిన్నారు. వైద్యులు చెప్పిన మాటలు విని షాక్‌కి గురయ్యారు. బాలిక ఆరు నెలల గర్భంతో ఉందని తెలియడంతో పెదనాన్న అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక తల్లిదండ్రులు నిలదీయడంతో తనకేమీ సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, బాలిక తల్లిదండ్రులతో రాజీ చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Read Also…  ECLBS Scheme: చిన్న వ్యాపారులకు కేంద్రం ఉపశమనం.. ఆక్సిజన్ ఫ్లాంట్లకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు