Hyderabad Crime News: ఏటీఎం నుంచి సరికొత్త రీతిలో దోపిడీ.. అది చూసి షాకైన బ్యాంక్ అధికారులు.. చివరికి ఏం జరిగిందంటే..

|

Oct 02, 2021 | 10:04 PM

Hyderabad Crime News: ఈ మధ్య కాలంలో ఏటీఎం చోరీ ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కొందరు ఏటీఎంలను ఎత్తుకెళ్తుంటే.. మరికొందరు ఏటీఎంలను..

Hyderabad Crime News: ఏటీఎం నుంచి సరికొత్త రీతిలో దోపిడీ.. అది చూసి షాకైన బ్యాంక్ అధికారులు.. చివరికి ఏం జరిగిందంటే..
Atm Cheating
Follow us on

Hyderabad Crime News: ఈ మధ్య కాలంలో ఏటీఎం చోరీ ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కొందరు ఏటీఎంలను ఎత్తుకెళ్తుంటే.. మరికొందరు ఏటీఎంలను టాంపరింగ్ చేసి దోచుకుంటున్నారు. తాజాగా సరికొత్త దోపిడీ వెలుగు చూసింది. అదికూడా హైదరాబాద్‌లోనే వెలుగు చూసింది. బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఓ దంపతులు ఏటీఎం లే లక్ష్యంగా సరికొత్త దోపిడీకి తెర లేపారు. చివరికి బ్యాంక్ అధికారులు పసిగట్టడంతో.. వారి దోపిడీకి అడ్డుకట్టడ పడటమే కాకుండా ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తప్పుడు సమాచారంతో బ్యాంక్ అధికారులను తప్పుదోవ పట్టించి నగుదు కాజేస్తున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజాహిద్(27), సాజిదా(25) దంపతులు. కొంతకాలంగా ఏటీఎంలే లక్ష్యంగా సరికొత్త చోరీకి పాల్పడుతున్నారు. ఎవరూ లేని సమయంలో వీరు ఎటీఎం సెంటర్‌లోకి ప్రవేశిస్తారు.

ఆ తరువాత ఏటీఎంను స్విచ్ఛాఫ్ చేస్తారు. తిరిగి ఏటీఎం మిషన్‌ను పది నిమిషాల తరువాత ఆన్ చేస్తారు. ఆపై సంబంధిత బ్యాంక్‌కు ఫోన్ చేసి తమ నగదు రాలేదని, కానీ మనీ కట్ అయ్యిందంటూ బ్యాంకు అధికారులకు సమాచారం అందిస్తారు. అది నమ్మి.. బ్యాంకు అధికారులు వారి ఖాతాలకు నగదును బదిలీ చేస్తుంటారు. వాస్తవానికి ఏటీఎం మిషన్‌ను స్విచ్ఛాఫ్ చేసిన సమయంలో అందులో జరిగిన ట్రాన్సాక్షన్ డేటా పూర్తిగా కనిపించకుండా పోతుంది. ఆ కిటుకుని తెలుసుకుని.. ఈ దుండగులు రెచ్చిపోయారన్నమాట. ఈ క్రమంలోనే కొంపల్లి ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ కార్తీక్ గౌడ్ రూ. 20 వేల నగదును బదిలీ చేశారు. అయితే, ఆ దంపతులు.. ఏటీఎం మెషీన్‌ను స్విచ్ఛాఫ్ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. తాజాగా ఆ ఫుటేజీని గమనించిన కార్తీక్ గౌడ్.. దాని ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మేనేజర్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

NRI News: విదేశాల నుంచి తిరిగొస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఏమాత్రం ఏమరపాటైనా మొత్తం కోల్పోతారు..!

Janasena Pawan Kalyan: బద్వేల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జనసేన.. ఆ నిర్ణయానికి కారణమేంటంటే..

EPS డబ్బులు విత్‌ డ్రా చేయాలంటే కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే..! లేదంటే సాధ్యంకాదు..