Santosh Nagar Gangrape: సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్.. అసలు మ్యాటర్ తెలిసి అవాక్కయిన పోలీసులు..

|

Aug 19, 2021 | 11:01 AM

Hyderabad: హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్‌ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. గ్యాంగ్ రేప్ ఆరోపణల నేపథ్యంలో ఉరుకులు పరుగుల మీద విచారణ సాగించిన పోలీసు

Santosh Nagar Gangrape: సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్.. అసలు మ్యాటర్ తెలిసి అవాక్కయిన పోలీసులు..
Santhosh Nagar Ps
Follow us on

Hyderabad: హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్‌ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. గ్యాంగ్ రేప్ ఆరోపణల నేపథ్యంలో ఉరుకులు పరుగుల మీద విచారణ సాగించిన పోలీసు ఉన్నతాధికారులు.. అసలు విషయం తెలుసుకుని బిత్తరపోయారు. రేప్ పేరుతో యువతి ఆడిన నటకాన్ని బట్టబయలు చేశారు. సంతోష్ నగర్‌కు చెందిన యువతి(20) బుధవారం సాయంత్రం సమయంలో తనను ముగ్గురు ఆటో డ్రైవర్లు ఎత్తుకెళ్లి గ్యాంప్ రేప్ చేశారంటూ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. యువతి ఫిర్యాదును ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటికప్పుడు విచారణలో స్పీడ్ పెంచారు. యువతి చెప్పిన కథనాల ప్రకారం దర్యా్ప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. ఉరుకులు పరుగులు పెట్టారు.

యువతి చెప్పిన సమయం ప్రకారం.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే, యువతి ఆరోపించినట్లుగా కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ ఆనవాళ్లు దొరకలేదు. దాంతో యువతిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటూ యువతిని పదే పదే ప్రశ్నించారు పోలీసులు. దాంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్‌కి వివాహం నిశ్చయం కావడంతో.. అతన్ని కేసులో ఇరికించడానికి గ్యాంగ్ రేప్ నాటకమాడినట్లు యువతి చెప్పుకొచ్చింది. దాంతో యువతి తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిన యువతిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

ఇదిలాఉంటే.. రేప్ కేసులు పోలీసులకు పెను సవాల్‌గా మారాయి. పలువురు యువతులు.. రక రకాల కారణలతో తమపై రేప్ జరిగిందని ఫిర్యాదులు చేస్తున్నారు. మొన్న ఘట్కేసర్, నేడు సంతోష నగర్ ఘటనలు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించడంతో.. పోలీసులు వాటిని సీరియస్‌గా తీసుకుని విరామం లేకుండా విచారణ జరిపి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తీరా నిజ నిజాలు తెలిశాక అవాక్కవుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఘట్కేసర్ కేసు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నగర పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

Also read:

Shreyas Iyer – IPL 2021: అయ్యారే.. అయ్యర్‌ షాట్‌ అదిరిపోయింది.. షాకింగ్ వీడియో మీకోసం..!

Bharat Biotech: భారత్ బయోటెక్ నుంచి మరో గుడ్ న్యూస్.. చిన్నారులకు త్వరలో టీకా..!

Corona Vaccine: టీకా సెంటర్‌లో యువకుడి హాంగామా.. చిన్న పిల్లాడిలా ఒకటే ఏడుపు..