Hyderabad: యువతిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్.. సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు..

Choreographer arrested: హైదరాబాద్‌లో ఓ యువతిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్‌ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో నకిలీ ఖాతాను సృష్టించి

Hyderabad: యువతిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్.. సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు..
Choreographer arrested

Updated on: May 22, 2021 | 6:26 AM

Choreographer arrested: హైదరాబాద్‌లో ఓ యువతిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్‌ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో నకిలీ ఖాతాను సృష్టించి కొరియాగ్రాఫర్.. గత కొంతకాలంగా ఆ యువతికి అసభ్య ఫోటోలను వీడియోలు పెడుతున్నాడు. దీనిపై యువతి ఫిర్యాదు మేరకు కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనిప్రకాశ్ షార్ట్ ఫిల్మ్‌లు తీస్తాడు. ఈ క్రమంలో 2020లో అతను నిర్మించిన షార్ట్ ఫిల్మ్ లో ఓ యువతి నటించింది. అయితే.. షూటింగ్ టైంలో ఆ అమ్మాయికి తెలికుండా మని ప్రకాశ్ కొన్ని అసభ్యకర సన్నివేశాలు షూట్ చేశాడు. అనంతరం వారిద్దరూ కూడా తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో మనిప్రకాష్. యువతి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆ యువతి కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్‌తో మాట్లాడటం మానేసింది.

ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మనిప్రకాశ్ ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తీరా విషయం బయటకు తెలియడంతో.. ఆ యువతి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా మనిప్రకాశ్‌కు సంబంధించిన పలు విషయాలను కూడా సేకరిస్తున్నారు.

Also Read:

Uganda Prostitution Racket: కోరుకున్న చోటుకు యువతులు.. ఆన్‌లైన్ వ్యభిచార ఉగాండా ముఠా గుట్టు రట్టు!

Tighten Lockdown: త‌ప్పుడు ప‌త్రాల‌తో రోడ్లపైకి వస్తే కఠినచర్యలు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ సీపీ