Husband Cuts Wife’s Nose: దేశంలో రోజురోజుకూ గృహ హింసకు సంబంధించిన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ.. మహిళలను వేధింపులకు గురిచేస్తున్న కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పుట్టింటికి వెళతానన్న భార్యపై.. ఓ భర్త దారుణంగా దాడిచేశాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళ ముక్కు కోశాడు. ఈ సంఘటన రాజస్థాన్‌నిలో జోధ్‌పూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం బాధితురాలు కుటుంబసభ్యులతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం భార్యపై దారుణంగా దాడి చేసిన భర్తపై జాన్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లునావాస్ గ్రామానికి చెందిన భూమా రామ్‌కి పూనమ్ దేవి (25) కి కొన్నెళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో పుట్టింటికి వెళతానని భార్య కొన్ని రోజుల నుంచి భర్త భూమాను కోరుతోంది. ఈ విషయంపై బుధవారం ఉదయం దంపతుల మధ్య గొడవ మొదలైంది. పూనమ్ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లివస్తానంటూ.. భర్తతో వారించింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన భర్త భూమా.. పూనమ్ దేవిపై కత్తితో దాడిచేశాడు. పూనమ్‌పై ముక్కును కత్తితో కత్తితో కోసినట్లు ఎస్ఐ కమల్ సింగ్ తెలిపారు.
అనంతరం ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మహిళ కుటుంబసభ్యులకు తెలియజేశారు. ప్రస్తుతం పూనమ్ పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే.. పూనమ్, ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు భూమ రామ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం పరారైన భూమ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: