Crime News: ఆ విషయం చెప్పలేదని పెళ్లైన వారానికే పుట్టింటికి వెళ్లిన భార్య.. అవమానంతో భర్త..

Hanamkonda district: క్షణికావేశంలో కొంతమంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్నపాటి గొడవలకే ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలకు తీరని శోకం మిగుల్చుతున్నారు.

Crime News: ఆ విషయం చెప్పలేదని పెళ్లైన వారానికే పుట్టింటికి వెళ్లిన భార్య.. అవమానంతో భర్త..
Crime

Updated on: Mar 01, 2022 | 9:37 AM

Hanamkonda district: క్షణికావేశంలో కొంతమంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్నపాటి గొడవలకే ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలకు తీరని శోకం మిగుల్చుతున్నారు. తాజాగా జాతీయ రహదారి కోసం జరిపిన భూసేకరణ విషయం నవ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. ఎకరం భూమి పోయిందన్న విషయంపై దంపతులిద్దరూ గొడవపడ్డారు. కోపంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన భర్త బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన హన్మకొండ జిల్లాలోని దామెర (damera) మండలం పసరగొండ గ్రామంలో చోటుచేసుకుంది. దామెర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పసరగొండ గ్రామానికి చెందిన నల్లెల గౌరయ్య (35) అనే యువకుడికి వారం కిందట భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లయింది. అయితే.. గౌరయ్యకు గ్రామంలో మూడెకరాల భూమి ఉంది.

అయితే.. నాగ్‌పూర్‌ – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం జరిపిన భూసేకరణలో మూడెకరాల్లో ఎకరం భూమి పోయింది. ఈ విషయం పెళ్లికి ముందు చెప్పలేదని మనస్తాపం చెందిన గౌరయ్య భార్య.. భర్తను నిలదీసింది. అనంతరం మూడురోజుల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. వివాహం జరిగి వారం కాకముందే ఇలా జరగటంతో మనస్తాపం చెందిన గౌరయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

AP News: ఎంతపనిచేశావమ్మ..? ఇద్దరు కుమార్తెలను చంపి.. వివాహిత ఏం చేసిందంటే..

Shocking: న్యూడ్ కాల్ అనగానే సొల్లు కార్చాడు.. ఆ మాయలేడి ఇచ్చిన ట్విస్ట్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది..!