హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. అక్కడా.. అక్కడా అని ఏమి లేదు. ఇళ్లు, బ్యాంకు, ఏటీఎం అని తేడా లేకుండా దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బ్యాంక్‌లో ఈ దొంగతనంకు ప్రయత్నించారు. వారు చేసిన ప్రయత్ని ఫలించక పోవడంతో బ్యాంకులోని కంప్యూటర్లు ఎత్తుకుపోయారు. ఇందంతా తెలంగాణ రాజధాని నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే..ఇద్దరు కపుల్స్. దొంగ కపుల్స్ చోరీ కథ ఇది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు దగ్గరలో ఉన్న సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో చోరీకి ప్రయత్నించారు ఇద్దరు దొంగలు. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు బ్యాంకులో చోరీకి ప్లాన్ వేశారు. ముందుగా బ్యాంక్ వద్దకు ఆటోలో చేరుకున్న ఆ ఇద్దరు కపుల్స్.. నేరుగా లోపలికి వెళ్లారు. బ్యాంక్‌కు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్లారు. సీసీ కెమెరాల కేబుల్ కట్ చేసి స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరిచేందుకు విఫలప్రయత్నం చేశారు. అది ఎంతకు తెరుచుకోలేదు.
స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లేందుకు వీలు కాకపోవడంతో.. బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇతర సామాగ్రిని ఆటోలో వేసుకుని పరారయ్యారు. దాదాపు మూడు గంటల పాటు దోపిడీకి ప్రయత్నించారు. రాత్రి రెండు గంటలకు బ్యాంకులోకి వెళ్లిన ఇద్దరు ఐదు గంటలకు ఆటోలో అక్కడి నుంచి నెమ్మదిగా ఇంటిదారి పట్టారు. బుధవారం ఉదయం బ్యాంకు తెరిచిన సిబ్బంది విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరే కాదు. వీరికి మరికొందరు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Apple Ice Cream : రుచికరమైన యాపిల్ ఐస్ క్రీమ్‌ను ఇంట్లో ప్రయత్నించి చూడండి.. చాలా ఈజీ..