Maharashtra Pharma Fire: మహారాష్ట్రలో మరో అగ్ని ప్రమాదం.. ఫార్మా కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు.. దట్టంగా కమ్ముకున్న పొగలు

|

Apr 28, 2021 | 1:43 PM

రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎంఐడీసీ)లోని ఎంఆర్‌ ఫార్మా కంపెనీలో అగ్రిప్రమాదం సంభవించింది.

Maharashtra Pharma Fire: మహారాష్ట్రలో మరో అగ్ని ప్రమాదం..  ఫార్మా కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు..  దట్టంగా కమ్ముకున్న పొగలు
Maharashtra Pharma Fire
Follow us on

Maharashtra Pharma Fire: మహారాష్ట్రలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం థానేలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో మంటలు చెలరేగి నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎంఐడీసీ)లోని ఎంఆర్‌ ఫార్మా కంపెనీలో అగ్రిప్రమాదం సంభవించింది. ఎంఐడీసీలోని ఎంఆర్‌ ఫార్మా కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ మొత్తానికి విస్తరించాయి. ప్రాణభయంతో కార్మికులు ఫ్యాక్టరీ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. 45 నిమిషాలపాటు శ్రమించి అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎనిమిది మంది శ్రామికులు ఉన్నారని, వారంతా క్షేమంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ఇంకా పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Read Also…  Viral: మానవత్వం చూపిన మూగజీవాలు.. మృగాళ్ల నుంచి చిన్నారిని కాపాడిన సింహాలు.!