Huge Fire Accident: అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టింబర్ డిపోలు తగులబడిపోయాయి. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న చేతి వృత్తిదారుల టింబర్ డిపోలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటనలో సుమారు రూ. 90 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటాలార్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న టింబర్ డిపో నిర్వహిస్తున్న సుమారు ఏడుగురు యజమానులు వారి కింద ఉపాధి పొందుతున్న సుమారు 50 కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారు. బుధవారం తెల్లవారుజామున ఊహించని పరిణామంతో విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఒక్కసారిగా మంటలంటుకుని టింబర్‌కు అంటుకుంది. దీంతో మంటలు వేగంగా వ్యాప్తి చెంది, పక్కన్నే మరో టింబర్ కూడా కాలి బూడిదైంది. అందులోని సుమారు రూ. 90 లక్షల విలువైన సామాగ్రితో పాటు భవన యజమానులు అందులో ఉంచిన మత్తి, టేకు, వేగి, జాలి, వేప తదితర కలప సామాన్లు బూడిదయ్యాయి. తాము సామాగ్రి నష్ట పోవడమే కాకుండా భవన యజమానులు ఇంటికి కావలసిన తలుపులు వాకిళ్లకు కావలసిన సామాన్లు కూడా కాలిపోయాయి. పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి చివరి నిమిషంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు అయితే అప్పటికే కాలి బూడిద కావడంతో పూర్తిగా నష్టం వాటిల్లింది.
కాగా, ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనా లేక మరేదైనా కారణమై ఉంటుందాని ఆరా తీస్తున్నారు.
Read Also… Kannada actress Shanaya: సొంత సోదరుడినే గొంతు కోసి హతమార్చిన సినీ నటి.. పోలీసుల అదుపులో షనయ