Hijab in AP: ఏపీని తాకిన హిజాబ్ వివాదం.. విద్యార్థినులను అనుమతించని కళాశాల యాజమాన్యం

|

Feb 17, 2022 | 3:38 PM

కర్ణాటకలో చెలరేగి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్(Hijab) వివాదం.. ఆంధ్రప్రదేశ్ ను తాకింది. విజయవాడ లయోలా కళాశాలలో(Layola College) హిజాబ్‌ వివాదం తలెత్తింది...

Hijab in AP: ఏపీని తాకిన హిజాబ్ వివాదం.. విద్యార్థినులను అనుమతించని కళాశాల యాజమాన్యం
Hijab Ap
Follow us on

కర్ణాటకలో చెలరేగి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్(Hijab) వివాదం.. ఆంధ్రప్రదేశ్ ను తాకింది. విజయవాడ లయోలా కళాశాలలో(Loyola College) హిజాబ్‌ వివాదం తలెత్తింది. హిజాబ్‌ వేసుకొచ్చిన ఇద్దరు విద్యార్థినులను సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్ద ఆపేశారు. హిజాబ్‌ ఎందుకు ధరించారని, దుస్తులు మార్చుకొని రావాలన్నారు. దీంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తాము మొదటి సంవత్సరం నుంచి హిజాబ్‌తోనే తరగతులకు హాజరవుతున్నామని, ఐడీ కార్డుల్లో కూడా హిజాబ్‌తోనే ఫొటో దిగామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థినుల సమాచారంతో కళాశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, మతపెద్దలు కళాశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడారు. పోలీసులు కూడా కాలేజీ వద్దకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రిన్సిపల్‌తో తల్లిదండ్రులు, పోలీసులు మాట్లాడిన కొద్దిసేపటి తర్వాత విద్యార్థినులను హిజాబ్‌తోనే తరగతి గదుల్లోకి అనుమతించారు.

     హిజాబ్ ధరించి ఇద్దరు విద్యార్థులు ఇవాళ కళాశాలకు వచ్చారు. తరగతి గదుల రౌండ్స్‌కు వెళ్తున్నప్పుడు వారిని గమనించాను. కళాశాలకు హిజాబ్‌ ధరించి వస్తున్నారేంటని ప్రశ్నించా. అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులు నా వద్దకు వచ్చారు. కళాశాలలో చేరేటప్పుడే నిబంధనలపై సంతకం చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో తరగతి గదిలోకి అనుమతించాం. రేపటి నుంచి హిజాబ్‌ ధరించి రావాలా? వద్దా?అనేది నిర్ణయిస్తాం.     

                              – కిశోర్, లయోలా కాలేజీ ప్రిన్సిపల్‌

Also Read

Nellore Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP Crime News: కీచకోపాధ్యాయుల సస్పెండ్.. క్రిమినల్ కేసు నమోదుకు విద్యాశాఖ మంత్రి సురేష్ ఆదేశం

Priyamani: పరువాలతో మైమరిపిస్తున్న ప్రియమణి లేటెస్ట్ శారీ పిక్స్ వైరల్