Heroin Seized: కలకలం రేపుతున్న డ్రగ్స్‌ దందా.. రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం..!

|

Nov 15, 2021 | 7:25 PM

Heroin Seized: డ్రగ్స్‌ దందా జోరుగా కొనసాగుతోంది. డ్రగ్స్‌ దందాను రూపుమాపేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. చాపకింద నీరులా డ్రగ్స్‌ వ్యాపారం కొనసాగుతోంది...

Heroin Seized: కలకలం రేపుతున్న డ్రగ్స్‌ దందా.. రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం..!
Heroin Seized
Follow us on

Heroin Seized: డ్రగ్స్‌ దందా జోరుగా కొనసాగుతోంది. డ్రగ్స్‌ దందాను రూపుమాపేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. చాపకింద నీరులా డ్రగ్స్‌ వ్యాపారం కొనసాగుతోంది. దీంతో భారత్‌ మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోంది. ప్రతి రోజు అనేక ప్రాంతాల్లో డ్రగ్స్‌ పట్టుబడుతుండటం ఇందుకు నిదర్శనం. ఇక డ్రగ్స్‌ కేంద్రంగా గుజరాత్‌ వార్తల్లోకెక్కుతోంది. మళ్లీ భారీ మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) సుమారు రూ.600 కోట్ల విలువైన 120 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకుంది. గత ఐదు నెలల కాలంలో గుజరాత్‌లో రూ.24,800 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్టు చేశారు అధికారులు.

అయితే గుజరాత్‌ కేంద్రంగా ఈ అక్రమ డ్రగ్స్‌ కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయి. వైజాక్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు అమెజాన్‌ ద్వారా గంజాయి సరఫరా కూడా కొనసాగుతోంది. అయితే దుస్తుల కంపెనీ పేరుతో గంజాయిని బట్టల మధ్య ప్యాక్ చేసి తరలిస్తున్నాయి ముఠాలు. గుట్టచప్పుడు కాకుండా జరిపే ఈ అక్రమ దందాపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు.. మధ్యప్రదేశ్‌లో ఓ ముఠా పట్టుబడింది. ఆదివారం రాత్రి జరిపిన ఆపరేషన్‌లో యాంటీ డ్రగ్స్‌ స్క్వాడ్‌ పట్టుకోవడం కలకలం రేపుతోంది.

అలాగే గత సెప్టెంబర్‌ నెలలో కచ్‌లోని ముంద్రా పోర్టులో 3వేల కిలోల డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. దీని విలువ రూ.21 వేల కోట్ల ఉంటుందని వెల్లడించారు. ఇలా డ్రగ్స్‌ అక్రమ రవాణా రోజురోజుకు పెరుగుతుండటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి:

RBI: రుణాలు ఇచ్చే ముందు ఇవి తప్పనిసరి.. బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం.. నిబంధనలు మరింత కఠినతరం..!

PF UAN Number: మీరు ఈపీఎఫ్‌ఓ యూఏఎన్‌ నంబర్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి..!