హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్‌కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మహారాష్ట్ర పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై రిలీజైన వెంటనే మహారాష్ట్ర పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ. 6 వేల కోట్లకు పైగా ప్రజల సొమ్మును నౌహీరా స్వాహా చేసింది. దాదాపు లక్షా 25 వేల మంది బాధితులు ఆమె మాటలు విని మోసపోయారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలకు కూడా హీరా గ్రూప్ నేర సామ్రాజ్యం విస్తరించింది. గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువగా వడ్డీ ఇస్తామని ఆశచూపిన మాయ లేడీ..భారీగా డిపాజిట్లు సేకరించింది.
తనపై నమోదైన కేసులన్నీ పోలీస్ స్టేషన్ల వారీగా కాకుండా సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలంటూ నాహీరా షేక్ కోర్టుకు విన్నవించుకోవడంతో..న్యాయస్థానం అందుకు అంగీకరించింది. కాగా విదేశాల నుంచి కూడా డిపాజిట్లు సేకరించడంతో..ఈడీ కూడా నౌహీరాపై కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.