Haryana Gang: సరిహద్దు జిల్లాలే వారి టార్గెట్. ఏటీఎం మెషీన్లను పగులగొట్టి భారీగా నగదు చోరీలే వారికి నిత్యకృత్యం. అవును.. తమిళనాడు, ఆంద్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, అరకోణం, ఉమ్మడి వెల్లూరు జిల్లాల్లో వరుస దోపిడీలతో హడలెత్తిస్తోంది ఓ గ్యాంగ్. గత కొంతకాలంగా ఏటీఎం మెషీన్లను పగులగొట్టి లక్షల రూపాయలు దోచుకుంది. దీంతో స్థానికులిచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..ఈ ముఠాపై నిఘా పెట్టారు.
ఈ మూడు జిల్లాల్లో జరిగిన ఏటీఎం దోపిడీలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను అన్ని జిల్లాలకు పంపించి అప్రమత్తం చేశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు..హర్యానా గ్యాంగే ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్టు నిర్థారించారు.
దీంతో హర్యానా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేశారు. చివరికి తిరువళ్లూరు జిల్లా ఎలావుర్ చెక్ పోస్ట్ సమీపంలో హర్యానా గ్యాంగ్‌ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సాజిద్ హర్షద్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Read also: Kerala couple: ఇది కదా బ్రతుకు..! కేరళలో కాఫీ షాప్ నడుపుతున్న వృద్ధ దంపతుల సూపర్ స్టోరీ