Drugs: రూ.9వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. బెజవాడతో లింక్ ఓ బూటకమే!

|

Sep 20, 2021 | 4:30 PM

9వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కోట్లు కుమ్మరించే డ్రగ్ మాఫియా వెనుక మాస్టర్ మైండ్ కుల్‌దీప్‌ సింగ్‌దేనని తేల్చారు పోలీసులు.

Drugs: రూ.9వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. బెజవాడతో లింక్ ఓ బూటకమే!
Drugs
Follow us on

9వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అఫ్గనిస్తాన్ టూ ఆంధ్రా కాకుండా ఢిల్లీ డెస్టినేషన్‌ స్పాట్‌గా గుర్తించారు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు. కోట్లు కుమ్మరించే డ్రగ్ మాఫియా వెనుక మాస్టర్ మైండ్ కుల్‌దీప్‌ సింగ్‌దేనని తేల్చారు. ఢిల్లీకి చెందిన కుల్‌దీప్‌ జూన్‌లోనే ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి 25టన్నుల డ్రగ్‌ రవాణా చేశాడు. తప్పుడు అడ్రస్‌లతోనే దందా చేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. విజయవాడకు భారీగా డ్రగ్ ఇంపోర్ట్‌ అవుతుందన్న వాదనలను సీపీ శ్రీనివాస్‌ కొట్టిపడేశారు. లైసెన్స్‌లు పొందడానికి ఒక చిరునామాగా మాత్రమే విజయవాడ అడ్రస్‌ వినియోగించారని క్లారిటీ ఇచ్చారు. అయితే 9వేల కోట్ల డ్రగ్ కేసుపై కేంద్ర ఏజెన్సీ డీఆర్‌ఐ మరింత లోతుగా విచారణ చేస్తోందన్నారు.

ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్‌ సరఫరా జరిగినట్లు డీఆర్‌ఐ అధికారులు ఐడెంటిఫై చేశారు. జూన్‌లోనే ఆషీ ట్రేడింగ్ కంపెనీకి 25 టన్నుల డ్రగ్స్‌ రవాణా చేశాడు కుల్‌దీప్ సింగ్. అలాగే రాజస్తాన్‌ వాసి జయదీప్‌ లాజిస్టిక్ పేరుతో కాకినాడకు డ్రగ్స్‌ రవాణా చేశాడు. లారీ నెంబర్ RJ 01 GB 8328 ద్వారా డ్రగ్స్‌ పంపించాడు. తప్పుడు అడ్రస్‌లతోనే కథ నడిపించాడు. బియ్యం రవాణా ముసుగులో డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నాడు కుల్‌దీప్‌ సింగ్‌.

గుజరాత్‌లోని ముంద్రా సీ పోర్టు ద్వారా డ్రగ్స్‌ రవాణా చేస్తున్నాడు కుల్‌దీప్‌‌. అఫ్గనిస్తాన్‌ నుంచి దిగుమతి అయ్యే బియ్యం, టాల్కం ఫౌడర్ పేరుతో డ్రగ్స్‌ షిఫ్ట్‌మెంట్ జరుగుతుంది. దేశంలోని పలు సీ పోర్టుల్లో డ్రగ్స్‌ దిగుమతి ఇలాగే జరుగుతున్నట్టు తేల్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కుల్‌దీప్‌ని పట్టుకునేందుకు డీఆర్‌ఐ గాలింపు ముమ్మరం చేసింది.

Also Read ఫ కచ్చులూరు బోటు ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు జననం

ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రిని నేనంటే నేనంటూ కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. ఒకరు మృతి