Gas Leak: నెల్లూరు జిల్లాలో విషాదం.. పరిశ్రమలో గ్యాస్ లీకేజీ.. ముగ్గురు మృతి.. మరొకరు..

|

May 11, 2021 | 1:32 PM

Gas Leak in Nellore Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ అయి

Gas Leak: నెల్లూరు జిల్లాలో విషాదం.. పరిశ్రమలో గ్యాస్ లీకేజీ.. ముగ్గురు మృతి.. మరొకరు..
Gas Leak
Follow us on

Gas Leak in Nellore Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ అయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో మంగళవారం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా గ్యాస్‌ లీకేజీ కావడంతో పరిశ్రమ లోపల ఉన్న ముగ్గురు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గ్యాస్‌కు లీకేజీకి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌రిశ్ర‌మ‌ల్లో త‌రుచూ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అంతకుముందు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో గ్యాస్ లీకేజీ అయి పదుల సంఖ్యలో బాధితులు మరణించిన సంగతి తెలిసిందే.

Also Read:

ఢిల్లీ ఆసుపత్రి నుంచి పరార్, నచ్చిన హాస్పిటల్స్ లోకి జంప్, హస్తినలో కోవిడ్ 19 రోగుల ‘దాగుడు మూతలు’, అధికారుల పరేషాన్ !

Telangana lockdown: తెలంగాణలో లాక్‌డౌన్..? సీఎం కేసీఆర్ నిర్ణయం అదేనా.. మరికాసేపట్లో కేబినేట్ భేటీ