Vijayawada hijra groups War: లింగమార్పిడి లోపంతో ఫంక్షన్‌లు, రోడ్లు, ట్రైన్‌లలో యాచించుకొని బతికే హిజ్రాల్లోనే పోటీ తత్వం పెరిగింది. వాళ్లలో వాళ్లకే వర్గాలు తయారయ్యాయి. ముఖ్యంగా విజయవాడలో మకాం వేసుకొని బతుకుతున్న హిజ్రాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంతగా అంటే ..ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం, ఒక వర్గంపై మరోవర్గం దౌర్జన్యం చేసుకునే వరకు వెళ్లాయి.
గిరిపురంలో నివాసం ఉంటున్న సరితా అనే ఈ హిజ్రా వర్గం గుడివాడవర్గంలో సభ్యులుగా ఉన్నారు. అయితే విజయవాడలోనే పుట్టి పెరగడంతో ఇక్కడ ఉంటూ భిక్షాటన చేస్తున్నారు. సింగ్‌నగర్‌కి చెందిన మరో హిజ్రా వర్గం కల్యాణి బ్యాచ్‌కి ఇది ఇష్టం లేకపోవడంతో సరితా వర్గంపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. విజయవాడ నుండి వెళ్లిపోవాలంటూ సరితా వర్గాన్ని బెదిరించడం, వేధింపులకు గురి చేస్తోందని సరిత వర్గం అంటోంది.
కల్యాణి అనే హిజ్రా వర్గం చెప్పినట్లు వినకపోతే బహిరంగ ప్రదేశాల్లో సరిత వర్గంపై దాడులు చేస్తోంది. ఒకవేళ విజయవాడలో ఉంటూ భిక్షాటన చేయాలంటే తమకు 30లక్షల రూపాయలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారంటోంది సరిత వర్గం. వాళ్లు పెట్టే వేధింపులు భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవడం లేదంటున్నారు. తమను బతకనివ్వకుండా చిత్రహింసలు పెడుతున్న కల్యాణి వర్గం నుంచి తమకు ప్రాణహాని లేకుండా చూడాలని వేడుకుంటున్నారు సరిత హిజ్రావర్గం.
Read Also… Afghanistan: కంచుకోట పంజ్‌షీర్ లోయకు వందలాది మంది తరలుతున్న తాలిబన్లు.. ట్విటర్‌లో14 సెకండ్ల వీడియో
Tribal Festival: అంటువ్యాధుల నివారణ కోసం శ్రావణ మాసంలో ఆదివాసీల పండగ.. కర్రగుర్రాలపై నడక