Vijayanagaram: ఆ విగ్రహం ఇంట ఉంటే దరిద్రం వదులుతుంది, సిరుల పంటే అంటారు.. కొంటే సీన్ సితారే

|

Aug 13, 2021 | 1:38 PM

మీ దరిద్రం వదులుతుంది. మేం ఇచ్చింది తీసుకుంటే మీకు అదృష్టం పడుతుంది. అని చెప్పే వాళ్లు ఎక్కువయ్యారు. ఇలాంటివి...

Vijayanagaram: ఆ విగ్రహం ఇంట ఉంటే దరిద్రం వదులుతుంది, సిరుల పంటే అంటారు.. కొంటే సీన్ సితారే
Fake God Idol
Follow us on

మీ దరిద్రం వదులుతుంది. మేం ఇచ్చింది తీసుకుంటే మీకు అదృష్టం పడుతుంది. అని చెప్పే వాళ్లు ఎక్కువయ్యారు. ఇలాంటివి ఎవరు వింటారులే అనుకోకండి. అలాంటి వాళ్ల ఉచ్చులో పడి కూడా చాలా మంది మోసపోతున్నారు. తాజాగా విజయనగరం రూరల్‌లో లక్కీ విగ్రహం పేరుతో మరో ముఠా మోసం తెరపైకి వచ్చింది. మహిమ గల విగ్రహాల పేరుతో జనాన్ని మోసం చేస్తున్న ముఠాలు విజయనగరం జిల్లాలో కోకొల్లుగా బయటపడుతున్నాయి. మా దగ్గరున్న పురాతన దేవత విగ్రహాలు కొంటే మీకు అదృష్టం పడుతుందని.. వ్యాపారంలో కలిసొస్తుందని కాళ్ల మహేష్‌ అనే వ్యాపారిని నమ్మించింది ఓ గ్యాంగ్. ఇంకా విచిత్రం ఏమిటంటే.. 1818 కాలానికి చెందిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుతో ఉన్న సిపాయి విగ్రహాన్ని అక్షరాల ఐదు కోట్లకు బేరం పెట్టారు నలుగురు కేటుగాళ్లు. సదరు వ్యాపారి…అంత మొత్తం చెల్లించుకోనని చెప్పడంతో…చివరకు 5లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో ఇంకా ట్విస్ట్ ఏమిటంటే ..అడ్వాన్స్‌గా 20వేలు తీసుకొని విగ్రహాన్ని చూపిస్తారు. ఆటుపై విగ్రహం టెస్ట్ చేసుకునేందుకు 2.5లక్షలు తీసుకుంటారు. విగ్రహం అప్పగించేటప్పుడు 2.5లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కన్నింగ్ గ్యాంగ్‌ ప్లాన్ బాగానే ఉన్నప్పటికి వ్యాపారికి విగ్రహం దేవతలది కాదనే డౌట్ రావడంతో విజయనగరం రూరల్ పోలీసుల్ని ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదుతో 420 కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠాలోని నలుగుర్ని అరెస్ట్ చేసారు. అమ్మకానికి పెట్టిన విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల దగ్గరున్న కారును సీజ్ చేశారు. పురాతన విగ్రహాల్లో మహిమలు ఉంటాయని మోసం చేసే వాళ్లను నమ్మవద్దని…ఇలాంటి విగ్రహాల్లో ఎలాంటి మహిమలు  ఉండవనని విజయనగరం డీఎస్పీ అనీల్‌ పులిపాటి తెలిపారు.  విజయనగరం జిల్లాలో ఇలాంటి కేసు ఇదేం కొత్త కాదు. గతంలో కూడా మహిమగల చెంబు అని జనాన్ని నమ్మించింది ఓ ముఠా పోలీసులకు చిక్కింది.

Also Read: త్రీ ఇడియట్స్.. పట్టపగలే ఇళ్లకు కన్నాలు.. సీసీలకు అస్సలు చిక్కరు.. ఫైనల్‌గా

హైదరాబాదీలు బీ అలెర్ట్… కాలకూట విషంగా మారిన భాగ్యనగరం మట్టి