తస్మాత్ జాగ్రత్త: OLX పేరిట మోసాలు..9 మంది అరెస్ట్

|

Oct 10, 2020 | 4:04 PM

OLX అంటే తెలియని వారుండరు. పాత వస్తువులు కొనడం, అమ్మడం వంటి లావాదేవీలకు బాగా ఉపయోగపడే ఆప్ ఇది ... కానీ ఇప్పుడది సైబర్ నేరగాళ్లకు అడ్డా గా మారింది.

తస్మాత్ జాగ్రత్త: OLX పేరిట మోసాలు..9 మంది అరెస్ట్
Follow us on

OLX అంటే తెలియని వారుండరు. పాత వస్తువులు కొనడం, అమ్మడం వంటి లావాదేవీలకు బాగా ఉపయోగపడే ఆప్ OLX … కానీ ఇప్పుడది సైబర్ నేరగాళ్లకు అడ్డా గా మారింది. olx ను అడ్డు పెట్టుకుని.. అమాయక ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్న తొమ్మిది మంది నిందితులు హైదరాబాద్ సీసీస్ సైబర్ క్రైం పోలీసులకు చిక్కారు. గత కొంత కాలంగా ఓఎల్ఎక్స్ లో వాహనాల నకిలీ ఫోటోస్ పెడుతూ… పలువురిని మోసం చేస్తున్న ముఠాను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజస్థాన్ రాష్ట్రం భారత్ పూర్ కు చెందిన 9 మందిని సీసీస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన ఎనిమిది మందిని వీరు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓఎల్ఎక్స్ లో టూ వీలర్ , ఫోర్ వీలర్, ఫోటో కెమెరాస్ లను తక్కువ ధరలకు అమ్ముతామంటూ పోస్టులు పెడుతూ… వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు పోలీసులు తేల్చారు. డబ్బులు పంపిన తర్వాత కూడా బుక్ చేసుకున్న వస్తువులు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.