Four killed in electrocuted : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్ల తగిలి ఓ ప్రైవేట్ బస్సు అగ్నికి అహుతి అయ్యింది. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యువాత పడగా.. మరో 10మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తంజావూర్ జిల్లాలోని తిరువైయారు సమీపంలో సమీపంలో చోటు చేసుకుంది. ప్రవేట్ ట్రావెల్స్ బస్సు తంజావూర్ వైపు వెళ్తుండగా తిరువైయారు వద్ద విద్యుత్ తీగలను రాసుకుంటూ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా బస్సు మొత్తం విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కరెంట్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన జరగడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి… ఏపీ గవర్నర్‌తో ఎస్ఈసీ సమావేశం.. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వివాదంపై చర్చ