Car Accident: గ్రేటర్ అధికారుల నిర్లక్ష్యానికి ఆసుపత్రిపాలై కుటుంబం.. రోడ్డు మధ్య గొయ్యిలో పడ్డ కారు..!

|

May 26, 2021 | 8:24 AM

గ్రేటర్ హైదరాబాద్ అధికారుల నిర్లక్ష్యానికి నలుగురు వ్యక్తుల ప్రాణాల మీదకు తెచ్చింది. డ్రైవర్ అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది.

Car Accident: గ్రేటర్ అధికారుల నిర్లక్ష్యానికి ఆసుపత్రిపాలై కుటుంబం.. రోడ్డు మధ్య గొయ్యిలో పడ్డ కారు..!
Hyderabad Car Accident
Follow us on

Car Fell Into a Pit on Road: గ్రేటర్ హైదరాబాద్ అధికారుల నిర్లక్ష్యానికి నలుగురు వ్యక్తుల ప్రాణాల మీదకు తెచ్చింది. డ్రైవర్ అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది. అంబర్‌పేట్‌ శివం రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారితో సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శివం రోడ్‌లో డ్రైనేజ్‌ కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తూ కారు పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అంబర్‌పేట్‌ నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది.

కారులో చిన్న పాపతో నలుగురు అంబర్ పేట్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రాజస్థాన్ వెళ్లే ట్రైన్ కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రమాదానికి గురయ్యారు. ప్రధాన రహదారిపై డ్రైనేజీ గొయ్యి చుట్టూ ఏలాంటి బారికేడ్లను ఏర్పాట్లు చేయకుండా పనులు చేయడమే.. ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…  Yaas Cyclone: తెలుగు రాష్ట్రాల వైపు దూసుకువస్తున్న ‘యాస్’ తుపాను.. తీరంలో అల్లకల్లోలం.. అధికారుల రెడ్ అలర్ట్