Hyderabad: ఫుడ్ డెలివరీ ద్వారా యవతి నంబర్ సేకరించి.. ఆపై ఏం చేశాడంటే..

|

Mar 31, 2024 | 9:50 PM

ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తు మహిళపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమధ్య కాలంలో ఆన్లైన్ మోసాలే కాదు ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆగడాలు కూడా మితిమీరిపోయాయి. కొందరు చేస్తున్న పోకిరి చేష్టలకు నిజాయితీగా ఫుడ్ డెలివరీ చేస్తున్న వారికి కళంకంగా మారింది.

Hyderabad: ఫుడ్ డెలివరీ ద్వారా యవతి నంబర్ సేకరించి.. ఆపై ఏం చేశాడంటే..
Food Delivery Boy
Follow us on

హైదరాబాద్, మార్చి 31: ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తు మహిళపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమధ్య కాలంలో ఆన్లైన్ మోసాలే కాదు ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆగడాలు కూడా మితిమీరిపోయాయి. కొందరు చేస్తున్న పోకిరి చేష్టలకు నిజాయితీగా ఫుడ్ డెలివరీ చేస్తున్న వారికి కళంకంగా మారింది. హోటల్ గదిలో అత్యాచారానికి పాల్పడిన 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నెలల క్రితం ఏర్పడిన పరిచయం అత్యాచారానికి దారి తీసింది. దీనిపై బాధిత మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్లేపల్లికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్‎గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడంతో నిందితుడితో పరిచయం ఏర్పడిందని ఆమె కంప్లైంట్‎లో పేర్కొంది.

ఓ ఫంక్షన్‎కు హాజరైన ఆమె హోటల్‌కు నిందితుడు ఆహారాన్ని డెలివరీ చేశాడు. ఫుడ్ డెలివరీ చేశాక దానికి డబ్బులు చెల్లించడం కోసం ఆమె ఇ-వాలెట్‌ను ఉపయోగించింది. అదే సమయంలో నిందితుడు తన ఫోన్ పే కి నగదు ట్రాన్స్ ఫర్ చేయాల్సిందిగా కోరాడు. దీంతో డెలివరీ బాయ్‎కి ఆమె ఫోన్ నంబర్‌ను పొందే అవకాశం వచ్చింది. దీంతో ఆమెకు మెసేజ్‎లు చేయడం, తరచూ ఫోన్ చేస్తూ విసిగించే వాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే కాలక్రమేణా ఆమెను వెంబడించడం, తరచూ సంప్రదించడంతో ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత గురువారం రాత్రి హోటల్‌లో తనను కలవాలని నిందితుడు మహిళను కోరాడు. ఆమెను బైక్‌పై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లాడు. నిద్రలోకి జారుకున్నప్పుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకోగలిగారు. అతనిపై IPC 376 సెక్షన్ ప్రకారం అత్యాచారంతో పాటు 354-డి, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..