Missing Boy Died: అదృశ్యమైన ఐదేళ్ల బాలుడి మృతి.. మురుగు కాలువలో బాలుడి మృతదేహం..

|

Jan 15, 2021 | 8:53 AM

Missing Boy Died: కామారెడ్డి మున్సిపాలిటీ దేవునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన ఐదేళ్ల బాలుడు నిషాంత్ మృతి

Missing Boy Died: అదృశ్యమైన ఐదేళ్ల బాలుడి మృతి.. మురుగు కాలువలో బాలుడి మృతదేహం..
Follow us on

Missing Boy Died: కామారెడ్డి మున్సిపాలిటీ దేవునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన ఐదేళ్ల బాలుడు నిషాంత్ మృతి చెందాడు. ఆడుకునేందుకు గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దేవునిపల్లిలో నిశాంత్ అనే ఐదేళ్ల బాలుడు గురువారం ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

చుట్టు పక్కల పరిసరాలు మొత్తం వెతికారు అయినా ఆచూకీ కానరాలేదు. అయితే శుక్రవారం తెల్లవారు జామున బాలుడి మృతదేహం మురికి కాలువలో లభ్యమైంది. దీంతో బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పండగ పూట బాలుడి మృతి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. బాలుడి కోసం తల్లిదండ్రులు విలపిస్తున్న తీరును చూసి గ్రామస్థులంతా శోక సముద్రంలో మునిగిపోయారు.

ఆదివాసీల ఆలయానికి కొత్త సొగసులు.. తుది దశకు చేరుకున్న పునర్నిర్మాణ పనులు.. ప్రత్యేకతలు ఏంటంటే..