Road Accident: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

Maharashtra Accident: మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై-పూణే ఎక్స్​ప్రెస్ వే ( Mumbai-Pune highway) పై లోనావాలాలోని

Road Accident: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..
Road Accident

Updated on: Jan 30, 2022 | 3:02 PM

Maharashtra Accident: మహారాష్ట్ర (Maharashtra) లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై-పూణే ఎక్స్​ప్రెస్ వే ( Mumbai-Pune highway) పై లోనావాలాలోని షీలత్నే వద్ద కారు భారీ కంటైనర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కుర్లాకు చెందిన వ్యక్తులు పూణే నుంచి ముంబైకి వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగిందని పోలీసులు తెలిపారు.

ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వస్తున్న కారు ఉదయం 8 గంటల సమయంలో షీలత్నే వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం ఆగకుండా రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న కంటైనర్ కిందికి దూసుకెళ్లిందని పూణే పోలీసులు తెలిపారు. దీంతో కారు నుజ్జునుజ్జు అయిందని.. అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Vijayawada: విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు.. టీడీపీ నాయకుడి అరెస్ట్..

Karimnagar Accident: కరీంనగర్‌లో కారు బీభత్సం.. గుడిసెలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి