Encounter: ఉలిక్కిపడిన మన్యం.. విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి!

Visakhapatnam: మన్యం కాల్పులతో దద్దరిల్లింది. విశాఖప‌ట్నం జిల్లా కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట‌ వ‌ద్ద‌ గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు

Encounter: ఉలిక్కిపడిన మన్యం.. విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి!
Maoists Encounter

Updated on: Jun 16, 2021 | 12:23 PM

Visakhapatnam Encounter: మన్యం కాల్పులతో దద్దరిల్లింది. విశాఖప‌ట్నం జిల్లా కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట‌ వ‌ద్ద‌ గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మ‌చారంతో మంప పీఎస్ ప‌రిధిలో పోలీసులు, భద్రతా దళాలు కూంబింగ్ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో బుధవారం తెల్ల‌వారుజామున గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జ‌రిగాయి.

ఎవ‌రెవరు చ‌నిపోయారు.. ఎంత మంది గాయ‌ప‌డ్డారనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంద‌ని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం కావ‌డంతో వివ‌రాలు తెలియ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఘ‌ట‌నాస్థ‌లికి అద‌న‌పు బ‌ల‌గాల‌ను త‌ర‌లిస్తున్నామ‌న్నారు.

ఘ‌ట‌నాస్థ‌లిలో ఏకే- 47, పలు తుపాకులు ల‌భ్య‌మ‌య్యాయ‌ని పోలీసులు తెలిపారు. మావోయిస్టు అగ్ర నేత‌లు త‌ప్పించుకున్నార‌న్న స‌మాచారంతో హెలికాప్ట‌ర్ సాయంతో గాలింపు చ‌ర్యలు చేప‌ట్టినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే.. ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ వాసి సందె గంగయ్య మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. సందె గంగయ్య డీసీఎం కమాండర్ గా కొనసాగుతున్నాడు.

Also Read:

Kadthal Birthday Party Case: కడ్తాల్ రేవ్ పార్టీ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు..

Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..

Loading...
Unable to load recommendations.
Follow Us