Guntur GGH Fire Accident: గుంటూరు నగరంలోని జీజీహెచ్ లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో భారీగా మంటలు చోటు చేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పతి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఆస్పత్రిలో రోగులు తక్కువగా ఉన్నారని, ప్రమాదం జరిగిన గది వినియోగంలో లేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.