Pakistan: కన్న తండ్రిని దారుణంగా చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. కుమారుడి పైశాచికం

|

May 19, 2022 | 9:27 AM

మనుషుల మధ్య మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొందరు దాడులు, నేరాలకు ఒడిగడుతున్నారు. కుటుంబ, సామాజిక పరిస్థితులు వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని సార్లు హత్యలూ, మానభంగాలకు....

Pakistan: కన్న తండ్రిని దారుణంగా చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. కుమారుడి పైశాచికం
Chennai Murder
Follow us on

మనుషుల మధ్య మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొందరు దాడులు, నేరాలకు ఒడిగడుతున్నారు. కుటుంబ, సామాజిక పరిస్థితులు వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని సార్లు హత్యలూ, మానభంగాలకు వెనుకాడటం లేదు. మరికొన్ని ఘటనల్లో సొంతవాళ్లు, రక్తం పంచుకు పుట్టిన వాళ్లు, కన్నవాళ్లపైనే దాడులకు తెగబడుతున్నారు. తాజాగా పాకిస్తాన్(Pakistan) లో ఇలాంటి ఘటనే జరిగింది. తండ్రి కొడుతున్నాడన్న కారణంతో ఓ యువకుడు తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. అంతే కాకుండా కొన్ని శరీర భాగాలకు నిప్పంటించాడు. ఈ ఘటనలో పోలీసులకు మరిన్ని విస్తుపోయే విషయాలు తెలిశాయి. పాకిస్తాన్ లోని కరాచీ సమీపంలో సూపర్ హైవేపై అఫ్గాన్ బస్తీ వద్ద పోలీసులు గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహానికి తల, కాళ్లు లేకుండా ఉండటం, శరీర భాగాలను ముక్కలుగా నరికి బ్యాగులో పడేసి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు గుర్తించి దర్యాప్తు చేపట్టగా పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

కన్న కొడుకే తండ్రిని దారుణంగా కొట్టి హత్య చేశాడని తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు ముక్కలుగా నరికినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ముక్కలుగా నరికిన బాడీ పార్ట్స్ కు నిప్పంటించినట్లు వెల్లడించాడు. తల మొండెం లేని శరీరాన్ని గుర్తించడానికి ఫోరెన్సిక్​ బృందం చాలా కష్టపడి అతని ఆచూకీ గుర్తించారు. ఈ శరీర భాగాలు పీఐబీ కాలనీకి చెందిన సలీం ఖిల్జీగా గుర్తించారు. అతడి కొడుకుపై అనుమానం వచ్చి విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నట్లు చెప్పారు. తండ్రిని హత్య చేసిన అనంతరం తలను లియారీ నదిలో, కాళ్లను జూబ్లీ మార్కెట్​లో, ఇతర భాగాలను అఫ్గాన్​ బస్తీ సమీపంలో వదిలివెళ్లినట్లు ఎస్ఎస్పీ అల్తాఫ్ హుస్సేన్ వివరించారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో ఇది అత్యంత భయంకరమైన సంఘటన అని, కన్న తండ్రి కొడుతున్నాడనే కారణంతో అతడిని చంపడం అత్యంత దారుణమని ఎస్ఎస్పీ ఆవేదన చెందారు. తన తండ్రి మృతదేహాన్ని ఎవరూ గుర్తించవద్దన్న ఉద్దేశంతో ఏప్రిల్​ 21న సుత్తితో కొట్టి హత్య చేసి ముక్కుముక్కలుగా చేసి వివిధ ప్రదేశాల్లో పడేశాడని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Viral Video: పార్లమెంట్‌లో యువతులతో డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌.! పార్లమెంట్‌ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..

Child Marriages: పుస్తకాలు పట్టుకునే వయసులోనే పుస్తెల తాడు.. బాల్య వివాహాల్లో ఏపీ టాప్‌.. తెలంగాణ ఏ స్థానంలో ఉందంటే..