ఫోన్ మాట్లాడుతుందని.. కన్న కూతురికే గుండు కొట్టించిన తండ్రి

| Edited By: Pardhasaradhi Peri

Mar 02, 2020 | 9:52 PM

యువకుడితో ఫోన్ మాట్లాడుతుందని కన్న కూతురిని దారుణంగా కొట్టడంతో పాటు నడి రోడ్డుపైకి లాక్కొచ్చి, గుండు కొట్టించాడు ఓ తండ్రి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్ పూర్..

ఫోన్ మాట్లాడుతుందని.. కన్న కూతురికే గుండు కొట్టించిన తండ్రి
Follow us on

Crime News: యువకుడితో ఫోన్ మాట్లాడుతుందని కన్న కూతురిని దారుణంగా కొట్టడంతో పాటు నడి రోడ్డుపైకి లాక్కొచ్చి, గుండు కొట్టించాడు ఓ తండ్రి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్ పూర్ సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ మైనర్ బాలిక.. తనకు తెలిసిన యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండటాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రుల కోపం కట్టలు తెంచుకుంది. అసలు సంగతి ఏంటో తెలుసుకోకుండా.. తప్పు చేస్తున్నావంటూ బాలికను దారుణంగా కొట్టి.. నడి రోడ్డుపైకి లాక్కొచ్చి, గుండు కొట్టించారు. అయితే ఇకపై ఆ అబ్బాయితో మాట్లాడనని, తనను క్షమించాలని బాలిక వేడుకున్నా.. కనికరం లేని తండ్రి నలుగురూ చూస్తుండగానే.. గుండు కొట్టించాడు.

ఈ ఘటను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ అవడంతో.. స్థానిక అధికారుల దృష్టికి చేరింది. వెంటనే దీనిపై స్పందించిన మహిళా సంఘాలు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశామని, విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Read More: జబర్దస్త్ కమెడియన్‌తో అసభ్య ప్రవర్తన.. ముద్దు పెట్టి.. వెకిలిచేష్టలు!