సీనియర్‌ ఐఏఎస్ అధికారి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా.. ముందే గుర్తించడంతో డీయాక్టివేట్ చేసిన కేటుగాళ్లు..

|

Feb 03, 2021 | 5:28 PM

రోజు రోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ మెయిల్స్ పంపించి అమాయకులను నట్టేట ముంచుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన అలాంటిదే... సీనియర్‌ ఐఏఎస్...

సీనియర్‌ ఐఏఎస్ అధికారి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా.. ముందే గుర్తించడంతో డీయాక్టివేట్ చేసిన కేటుగాళ్లు..
Follow us on

Fake Facebook Account : రోజు రోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ మెయిల్స్ పంపించి అమాయకులను నట్టేట ముంచుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన అలాంటిదే… సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆయన అసలు ఫేస్‌బుక్‌ ఖాతాలోని చాలా మంది మిత్రులకు ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపారు.

తన ఒరిజినల్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో వివిధ సందర్భాల్లో పోస్టు చేసిన వ్యక్తిగత ఫొటోలను నకిలీ ఖాతా తెరవడానికి ఆగంతకులు వాడుకున్నారు. ఇవి చూసిన అరవింద్ స్నేహితులు నిజంగానే అరవింద్‌కుమార్‌ రెండో ఖాతా తెరిచారని భావించి ఫ్రెండ్‌ రిక్వెస్టును యాక్సెప్టు చేశారు. ఇలా యాక్సెప్ట్‌ చేసిన కొందరితో ఆగంతకులు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా అరవింద్‌కుమార్‌ పేరుతో మెసెజ్  పంపారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న అరవింద్‌కుమార్‌ వెంటనే ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయడంతో పాటు తన మిత్రులను అప్రమత్తం చేస్తూ తన ఒరిజినల్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. ఫేస్‌బుక్‌ ఏ మాత్రం సురక్షితం కాదని, సరైన రీతిలో కేవైసీ ప్రక్రియ చేపట్టకుండానే ఎవరినైనా కొత్త ఖాతాలు తెరిచేందుకు ఫేస్‌బుక్‌ యంత్రాంగం అనుమతిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తాను ఫేస్‌బుక్‌ నుంచి శాశ్వతంగా వైదొలగుతున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఫేస్‌బుక్‌లో అరవింద్‌కుమార్‌ ఓ పోస్టు ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చూసిన ఆగంతకులు నకిలీ ఖాతాను డీయాక్టివేట్‌ చేశారు. అయితే ఇది చేసిన కేటుగాళ్ల కోసం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో తాను ఎవరికి ఎలాంటి రిక్వెస్టులు పంపించలేదని పేర్కొన్నారు. సైబర్ నేరస్తులను ఎప్పుడు ఓ కంట కనిపెట్టుకుని ఉండాని కోరారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..