AP Crime News: ఇంట్లో దిమ్మతిరిగే సెటప్.. పుస్తకాలకు అట్టలేసినట్టు అలవోకగా నకిలీ కరెన్సీ తయారీ

|

Apr 04, 2021 | 8:05 PM

చెడు వ్యసనాలు, ఈజీ మనీ వేటలో కొందరు వ్యక్తులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఏకంగా నకిలీ కరెన్సీని తయారు చేస్తూ...జల్సాలు సాగిస్తున్నారు.

AP Crime News: ఇంట్లో దిమ్మతిరిగే సెటప్.. పుస్తకాలకు అట్టలేసినట్టు అలవోకగా నకిలీ కరెన్సీ తయారీ
Fake Currency Racket
Follow us on

చెడు వ్యసనాలు, ఈజీ మనీ వేటలో కొందరు వ్యక్తులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఏకంగా నకిలీ కరెన్సీని తయారు చేస్తూ…జల్సాలు సాగిస్తున్నారు. చివరకు కథ అడ్డం తిరిగి, ఇంటినే నకిలీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్‌గా మార్చేసిన ముఠాకు ఊహించని గట్టి షాక్‌ ఇచ్చారు పోలీసులు.

నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు ప్రకాశం పోలీసులు. చీరాల బాలసాయి నగర్‌లోని ఓ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నకిలీ నోట్లు తయారీకి వినియోగిస్తున్న ముద్రణ అచ్చులు, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ సహా సుమారు లక్ష రూపాయల విలువగల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

బాలసాయి నగర్‌లోని ఓ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసులు వెళ్లేసరికి నకిలీ నోట్ల తయారీలో ఎనిమిది మంది సభ్యులు బిజీగా ఉన్నారని, పోలీసుల్ని చూసి ఇద్దరు నిందితులు పారిపోయారని, వారికోసం గాలిస్తున్నట్లుగా చెప్పారు. ఈ ముఠా 500, 200, 50 నకిలీ కరెన్సీని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులు చీరాల, పర్చూరు, మంగళగిరికి చెందినవారని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ప్రధాన నిందితుడు మధుసూదనరావు గతంలో ఒక సారి దొంగ నోట్లు తయారీలో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలిపారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు.

Also Read: కరోనా కారణంగా ఉద్యోగం పోయింది… అతడు ‘లిల్లీ’ పంటతో జీవితాన్నే సాగు చేసుకున్నాడు.. యువకుడి విజయగాథ

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. అదే సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ.. డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు