Fake Currency: జూబ్లీహిల్స్‌లో ఫేక్ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్.. ఈ నకిలీ దందా లోతుల్లోకి వెళితే..

|

Aug 19, 2021 | 5:30 PM

జూబ్లీహిల్స్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న.. ఐదుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 7 లక్షల నకిలీ కరెన్సీతో పాటు.. ప్రింటర్

Fake Currency: జూబ్లీహిల్స్‌లో ఫేక్ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్.. ఈ నకిలీ దందా లోతుల్లోకి వెళితే..
Fake Currency
Follow us on

Fake Currency Racket: జూబ్లీహిల్స్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న.. ఐదుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 7 లక్షల నకిలీ కరెన్సీతో పాటు.. ప్రింటర్, స్కానర్, ల్యాప్‌టాప్ సీజ్ చేశారు. నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణకు పాల్పడుతోన్న ఐదుగురు నిందితులు సిద్దిపేటకు చెందిన వ్యక్తులని సీపీ అంజన్ కుమార్ వెల్లడించారు. వీళ్లలో డిస్మిడ్డ్ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ సుంకర శ్రీనివాస్ కూడా ఉన్నారన్నారు సీపీ అంజన్ కుమార్.

ఈ ముఠా హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో తిష్టవేసి రెండు 500 నోట్లను మొదటగా తయారు చేసి, మార్కెట్ లో చెలామణి చేశారని సీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, వాటిని ఎవ్వరూ నకిలీ కరెన్సీ అని.. గుర్తు పట్టలేదు కావునా.. పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ తయారు చేశారన్నారు సీపీ అంజన్ కుమార్.

ఇక నకిలీ వ్యవహారం లోతుల్లోకి వెళితే.. ఎంబీఏ పూర్తి చేసిన సంతోష్ కుమార్.. ఫోటోగ్రాఫర్ గా స్థిరపడాలనుకొన్నాడు. అయితే ల్యాబ్ ఏర్పాటు చేయడానికి సంతోష్ వద్ద డబ్బు లేదు. దీంతో ఫోటో ల్యాబ్ ఏర్పాటు కోసం ఏకంగా నకిలీ నోట్ల తయారీనీ ప్రారంభించాడు సిద్దిపేటకు చెందిన చుక్కాపురం సంతోష్ కుమార్. సంతోష్‌కు సాయికుమార్, నీరజ్ కుమార్, జలగం రాజులు జత కలిశారు. వీళ్లంతా ఓ ముఠాగా ఏర్పడి.. దొంగ నోట్ల ముద్రణకు కావాల్సిన సామాగ్రిని సేకరించారు. అచ్చు నిజమైన కరెన్సీ మాదిరిగానే కరెన్సీ తయారు చేశారు. వీరికి తోడుగా మార్కెటింగ్ చేయడానికి డిస్మస్ అయిన బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ సుంకర్ శ్రీనివాస్ వీళ్ల టీంలో చేరాడు. మార్కెటింగ్ చేసి కమిషన్ తీసుకుంటానన్నాడు. పక్కా ప్లాన్ చేసుకున్నారు.

26 లక్షల నకిలీ కరెన్సీనీ తయారు చేశారు. ప్రింట్ చేసిన నకిలీ కరెన్సీ మార్కెట్లో పంపిణీ చేద్దామనుకునే సమయంలోనే.. కరెక్టుగా ఎంటర్ అయ్యారు పోలీసులు. నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఐదుగురి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ముఠాలో ప్రధాని నిందితుడు చుక్కాపురం సంతోష్ కుమార్ అని తేల్చారు సీపీ అంజన్ కుమార్. నకిలీ.. అసలైన కరెన్సీని పోల్చి చూస్తే పెద్దగా తేడా లేకుండా తయారు చేశారన్నారు సీపీ.

కానీ రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా అనే పదం ముద్రణలో అచ్చు తప్పు దొర్లిందన్నారు సీపీ అంజన్ కుమార్. ఇది తప్పా మరెక్కడా నకిలీ కరెన్సీ అని గుర్తుపట్టలేని స్థాయిలో ముద్రించరన్నారు. వీళ్ల వెనుక పెద్ద రాకెట్‌ నడుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read also: Cyber Crime: సైబర్ నేరాలపై ప్రత్యేక వ్యవస్థ.. ఆన్‌లైన్లో ఫిర్యాదు చేసెయ్యండిలా..!