Brown Sugar: బ్రౌన్ షుగర్ వినియోగిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు…. పది మంది అరెస్టు

|

Feb 23, 2022 | 7:46 PM

Brown Sugar: గుంటూరులో బ్రౌన్ షుగర్ కలకలం రేగింది. బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి ఇతరులకు విక్రయిస్తున్న శ్యామ్‌తో పాటూ మరో తొమ్మిది మందిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు..

Brown Sugar: బ్రౌన్ షుగర్ వినియోగిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు.... పది మంది అరెస్టు
Follow us on

Brown Sugar: గుంటూరులో బ్రౌన్ షుగర్ కలకలం రేగింది. బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి ఇతరులకు విక్రయిస్తున్న శ్యామ్‌తో పాటూ మరో తొమ్మిది మందిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన కృష్ణారెడ్డి వద్ద నుండి రెండు గ్రాముల బ్రౌన్ షుగర్‌ను డిగ్రీ విద్యార్థి (Student) శ్యామ్ కొనుగోలు చేశాడు. తాను వినియోగించడానికి కొనుగోలు చేసినా ఇతరులు ఎక్కువ డబ్బులిస్తామని ఆశ చూపడంతో విక్రయించేందుకు ముందుకు వచ్చాడు‌. ఈ విషయం పోలీసులకు తెలియడంతో శ్యామ్‌ను అరెస్టు చేసి అతనితో ఈ కేసులో సంబంధం ఉన్న మరో తొమ్మిది మందిని అరెస్టు (Arrest) చేశారు.

వారి వద్ద నుండి రెండు గ్రాముల బ్రౌన్ షుగర్, యాభై గ్రాముల గంజాయితో పాటు గంజాయి తాగటానికి ప్రత్యేకంగా తయారు చేసుకున్న రెండు పెట్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న విద్యార్థుల్లో వివిధ శాఖల్లో పని చేస్తున్న, రిటైర్డ్‌ ఉద్యోగుల పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే తల్లిదండ్రులు వెంటనే పోలీసులను సంప్రదించాలని డిఎస్పీ సుప్రజ చెప్పారు‌. ప్రాథమిక స్థాయిలో ఈ అలవాటు ఉన్నప్పుడు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి అలవాటు మాన్పించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు భయపడకుండా పోలీసులను సంప్రదిస్తే వారి భవిష్యత్తును కాపాడవచ్చన్నారు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

ఇవి కూడా చదవండి:

వీడి స్టైలే డిఫరెంట్.. మోసపోయిన తీరునే అస్త్రంగా మార్చుకున్న కేటుగాడు.. ఏం చేశాడో తెలిస్తే అవాక్కవుతారు..!

ప్రియుడిని చితక బాదిన యువతి.. కారణం తెలిస్తే శెభాష్ అనాల్సిందే..