RAGGING: ర్యాగింగ్ కలకలం.. అర్ధరాత్రి అర్ధనగ్నంగా డ్యాన్సులు.. మద్యం తీసుకురావాలంటూ బలవంతం

|

Feb 07, 2022 | 10:54 AM

అనంతపురం జేఎన్​టీయూలో ర్యాగింగ్ భూతం కలకలం రేపుతోంది. ర్యాగింగ్‌ ఆరోపణలతో 18 మంది ఇంజినీరింగ్ రెండో ఏడాది విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. జూనియర్ల ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...

RAGGING: ర్యాగింగ్ కలకలం.. అర్ధరాత్రి అర్ధనగ్నంగా డ్యాన్సులు.. మద్యం తీసుకురావాలంటూ బలవంతం
Atp Jntu
Follow us on

అనంతపురం జేఎన్​టీయూలో ర్యాగింగ్ భూతం కలకలం రేపుతోంది. ర్యాగింగ్‌ ఆరోపణలతో 18 మంది ఇంజినీరింగ్ రెండో ఏడాది విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. జూనియర్ల ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూనియర్లను సీనియర్ విద్యార్థులు రాత్రివేళ సినిమాకు తీసుకెళ్లటంతో పాటు, గదిలోకి పిలిపించి అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాలకు రాగా యాజమాన్యమే తగిన చర్యలు తీసుకుంటుందని అధ్యాపకుల కమిటీ పోలీసులకు తెలిపింది. దీంతో వసతిగృహంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు వెళ్లిపోయారు. ఈ ఘటనపై వీసీ రంగజనార్దన పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ అంశంపై నేడు అధ్యాపకుల కమిటీ విచారణ చేపట్టనుంది.

అనంతపురం జేఎన్‌టీయూలో సీనియర్, జూనియర్‌ విద్యార్థుల హాస్టళ్లు వేర్వేరుగా ఉన్నాయి. అయినా సీనియర్స్ స్టూడెంట్స్ ర్యాగింగ్‌ పేరిట వికృత క్రీడ సాగిస్తున్నారు. అర్ధరాత్రి వేళ జూనియర్లను సీనియర్‌ విద్యార్థుల హాస్టల్‌కు రప్పిస్తున్నారు. అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయిస్తూ.. వికృత ఆనందం పొందుతున్నారు. సిగరెట్లు, మద్యం తీసుకురావాలని బలవంతం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్ పి.సుజాత తెలిపారు.

Also Read

Top 9 News: తెలుగు రాష్ట్రాల ట్రెండింగ్ వార్తలు.. పొలిటికల్ న్యూస్ సమాహారం “టాప్ 9 న్యూస్” (వీడియో)

Petrol Diesel Price: స్థిరంగా చమురు ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..

అమాయక చూపులతో అందాల వల విసురుతోన్న నిత్యా..