Instant loan apps case: లోన్ యాప్స్ కేసులో కదులుతోన్న కూసాలు.. ఏకంగా 131 కోట్ల రూపాయలు సీజ్

|

Oct 01, 2021 | 7:23 AM

ఉచ్చు బిగుస్తోంది. మనీ యాప్స్ ఆగడాలకు చెక్‌ పడుతోంది. ఈడీ దాడి ఏకంగా కూసాలు కదులుతున్నాయి. ఇండియా బోర్డర్ దాటిన కోట్లెన్ని? ఈడీ విచారణలో తేలిందేంటి?

Instant loan apps case: లోన్ యాప్స్ కేసులో కదులుతోన్న కూసాలు.. ఏకంగా 131 కోట్ల రూపాయలు సీజ్
Loan Apps Case
Follow us on

లోన్‌యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ -ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఫైనాన్స్‌ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ -PSFS కంపెనీకి చెందిన మరో 131 కోట్ల రూపాయలను జప్తు చేసింది. క్యాష్‌ బీన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా రుణాలు ఇచ్చినట్లు గుర్తించింది. చైనాకు చెందిన జో యాహుయ్‌ ఆధీనంలో PSFS పనిచేస్తోందని వివరాలు రాబట్టింది. బోగస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల పేరిట చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, యూఎస్‌, సింగపూర్‌లకు నిధులు మళ్లించినట్లు తేల్చింది. ముఖ్యంగా ఫెమా నిబంధలను PSFS పూర్తిగా ఉల్లంఘించిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. PSFS చెందిన 106 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ గతంలోనే జప్తు చేసింది. సరకు దిగుమతి పేరుతో 429 కోట్ల నగదును విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. ఈడీ ఎంట్రీతో చైనా ముఠా బండారం బట్టబయలైంది. ఇండియాకు ఒక్క పైసా కూడా బెనిఫిట్ జరగకుండా చైనీస్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. ఫోన్ల ద్వారానే మొత్తం బిజినెస్ జరిగిపోతుంది. అందుకే ఎలాంటి అనుమతులు తీసుకోరు.

కానీ వేలకోట్ల లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ డబ్బంతా భారత్‌దే. ఒక్క రూపాయి పెట్టుబడితో వందలు వేల రూపాయలు కొట్టేస్తారు. ఇలా కొట్టేసిన డబ్బును తెలివిగా దేశం దాటించేస్తారు. లోన్ యాప్స్ పేరుతో చైనీస్ ముఠా భారీ కుట్రకు ప్లాన్ చేసింది. వ్యాపారం భారత్‌లో.. లాభాలు మాత్రం చైనాకు. అదీ కూడా అక్రమ మార్గంలో. ఇన్‌స్టెంట్ లోన్స్ పేరుతో వేలకోట్లు కొల్లగొట్టిన చైనీస్ ముఠాలు… ఆ డబ్బును అక్రమ మార్గంలో చైనాకు తరలించాయి. మనీ లాండరింగ్‌కి సైతం దొరక్కుండా అత్యంత తెలివిగా దేశం దాటించేశాయి.

Also Read: ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు