టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. అనూహ్యంగా ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ బడా సెలబ్రిటీలకు నోటీసులు వెళ్లాయి. కాగా ఈడీ ఎంక్వైరీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఓ సరికొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అదే డార్క్ వెబ్, బిట్‌కాయిన్ పేమెంట్స్. అవును, ఇది జస్ట్ సినీ పరిశ్రమ.. అందులో కొందరికి మాత్రమే సంబంధించిన వ్యవహారంలా కనిపించడం లేదు. ఇందులో అంతర్జాతీయ మార్కెట్, డ్రగ్స్ మాఫియా ఇన్‌వాల్వ్ అయ్యి ఉందన్న క్లారిటీ ఈడీ విచారణతో వస్తోంది. డ్రగ్స్‌ను మించి డబ్బు వ్యవహారం, హవాలా లాంటి ఆర్థిక నేరాలు ఈడీ దర్యాప్తులో బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కెల్విన్‌కు అమెరికాలోని అంతర్జాతీయ మత్తుమందుల ముఠాతో సంబంధాలున్నాయి. అమెరికా నుంచి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి. ఇందుకోసం కెల్విన్ సహా అమ్మకందారులు ఎంచుకున్న మార్గం పక్కా ఆన్‌లైన్. అంటే డార్క్ వెబ్‌సైట్ లోనే ఆర్డర్లు జరిగాయి.
సరుకు దిగుమతికి మాత్రం కొరియర్ సర్వీస్‌ను వాడుకున్నారు. చివరికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా కూడా ఇంపోర్ట్స్ జరిగాయి. మరి చెల్లింపులు ఎలా అంటే బిట్‌కాయిన్. అవును, ఎవరి నుంచి ఎవరికి చేరుతుందో ఎలా చేరుతుందో తెలియని రీతిలో బిట్ కాయిన్ రూపంలో వ్యవహారం జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బిట్ కాయిన్ అన్నది డిజిటల్ కరెన్సీ అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఈ డిజిటల్ కరెన్సీలపై జనాలు ఫోకస్ పెట్టారు. అయితే ఎప్పట్నుంచో ఈ రూట్‌లో డ్రగ్స్‌కు చెల్లింపులు చేసినట్టు ఈడీకి ఉప్పు అందింది. అందుకే మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు ప్రస్తుతం సీరియస్‌గా దర్యాప్తు జరుపుతుంది.
విచారణ తేదీలు, హాజరవ్వాల్సిన ప్రముఖులు:
Aug 31: పూరీ జగన్నాథ్
Sept 2 : చార్మీ కౌర్
Sept 6 : రకుల్ ప్రీత్ సింగ్
Sept 8 : రానా దగ్గుబాటి
Sept 9 : రవితేజతోపాటు అతని డ్రైవర్ శ్రీనివాస్
Sept 13: నవ్‌దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్
Sept 15: ముమైత్ ఖాన్
Sept 17: తనీష్
Sept 20: నందు
Sept 22: తరుణ్, తనీష్, నందు
Also Read: తంత్రం వేసి క్షుద్రపూజలు… వారు క్షణం ఆలస్యం చేసి ఉంటే పసిపాప కత్తికి బలైపోయేది