Drugs: ముంద్రా పోర్టులో రూ.2వేల కోట్ల హెరాయిన్‌ పట్టివేత.. విజయవాడలోని కంపెనీ పేరుతో..

|

Sep 17, 2021 | 4:55 AM

DRI Seizes Drugs: దేశంలో సాధారణంగా డ్రగ్స్ పట్టుబడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా వేల కోట్ల విలువ నిషేధిత మాదకద్రవ్యాలు పట్టుబడటం

Drugs: ముంద్రా పోర్టులో రూ.2వేల కోట్ల హెరాయిన్‌ పట్టివేత.. విజయవాడలోని కంపెనీ పేరుతో..
Afghan Heroin
Follow us on

DRI Seizes Drugs: దేశంలో సాధారణంగా డ్రగ్స్ పట్టుబడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా వేల కోట్ల విలువ నిషేధిత మాదకద్రవ్యాలు పట్టుబడటం సంచలనంగా మారింది. గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెండు సరుకు రవాణా ఓడలు ముంద్రా నౌకాశ్రయానికి వచ్చాయి. వాటిలోని సరుకు టాల్కం పౌడర్‌ అని కస్టమ్స్‌ పత్రాల్లో పేర్కొన్నారు. అది విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి వెళ్లాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

అనుమానం వచ్చి డీఆర్‌ఐ అధికారులు ఓడల్లో తనిఖీలు ప్రారంభించారు. తనిఖీల అనంతరం రెండు కంటెయినర్లలో.. పౌడర్‌తోపాటు హెరాయిన్‌ ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కనీసం రూ.2వేల కోట్లు ఉంటుందని ముంద్రా డీఆర్ఐ అధికారులు తెలిపారు. రెండు షిప్పింగ్ కంటైనర్లను కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ముంద్రా స్వాధీనం చేసుకుంది. అయితే.. దీనిపై మరింత విచారణ చేపట్టాల్సి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా భారీ మొత్తంలో నిషేధిత డ్రగ్స్ పట్టుబడటం.. విజయవాడతో లింకులు ఉండటంతో ఈ వ్యవహారంపై పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

Also Read:

Revanth Reddy: కేటీఆర్ ట్విట్.. క్షమాపణలు చెప్పిన రేవంత్ రెడ్డి.. చివరకు శశి ధరూర్ ఏమన్నారంటే..?

PM Modi Birthday: 20 రోజులపాటు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.. ఈ సారి అంత ప్రత్యేకం ఎందుకో తెలుసా..?