AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్ళికి నిరాకరించాడని.. ప్రియుడిపై యాసిడ్ దాడి!

పెళ్ళికి నిరాకరించాడని ఓ ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని వికాస్‌పురిలో జూన్ 11న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే వికాస్‌పురిలో ఉంటున్న ఇద్దరు ప్రేమికులు.. ఒకరిని ఒకరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ ఇటీవల ప్రియుడు.. మనం ఇద్దరం విడిపోదాం అని ప్రియురాలికి చెప్పాడు. ఆ మాటతో తనను ఇక పెళ్లి చేసుకోడని గ్రహించిన సదరు యువతి.. అతనిపై అక్కసు పెంచుకుని యాసిడ్ […]

పెళ్ళికి నిరాకరించాడని.. ప్రియుడిపై యాసిడ్ దాడి!
Ravi Kiran
|

Updated on: Jun 17, 2019 | 4:57 PM

Share

పెళ్ళికి నిరాకరించాడని ఓ ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని వికాస్‌పురిలో జూన్ 11న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే వికాస్‌పురిలో ఉంటున్న ఇద్దరు ప్రేమికులు.. ఒకరిని ఒకరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ ఇటీవల ప్రియుడు.. మనం ఇద్దరం విడిపోదాం అని ప్రియురాలికి చెప్పాడు. ఆ మాటతో తనను ఇక పెళ్లి చేసుకోడని గ్రహించిన సదరు యువతి.. అతనిపై అక్కసు పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడింది. ఒక రోజు ప్రేమికులు ఇద్దరూ బైక్‌పై వెళుతున్న తరుణంలో.. హెల్మెట్ తీయమని ప్రియురాలు తన ప్రియుడిని కోరింది. దీంతో అతను హెల్మెట్ తీయగా.. అతని ముఖంపై యాసిడ్ తో దాడి చేసింది.

ఈ క్రమంలో ప్రియుడికి ముఖం, మెడ, ఛాతిపై గాయాలు కాగా.. ప్రియురాలు చేతికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరూ దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో చేరారు. ఇకపోతే ప్రియురాలు.. తమపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. అయితే ఆమె ఇచ్చిన సమాధానంతో పోలీసులకు అనుమానం రాగా.. కోలుకున్న తర్వాత ప్రియుడిని ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని పోలీసులు గ్రహించారు. ఇక ప్రియురాలిని తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. అసలు నిజం బయటపెట్టింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.