26th January violence: ఢిల్లీ ఎర్రకోట హింసాకాండ కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26న ఢిల్లీలో రైతులు నిర్వహించిన డాక్టర్ పరేడ్‌లో హింసాకాండకు కారణమైన ఇద్దరు జమ్మూ రైతు సంఘం నేతలను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న రాజధానిలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఎర్రకోట, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో హింసాకాండ చెలరేగింది. ఈ ఘటనలో కీలక నిందితుడైన జమ్మూకశ్మీర్ యునైటెడ్ కిసాన్ ఫ్రంట్ అధ్యక్షుడు మోహిందర్ సింగ్ (45), అదేవిధంగా జమ్మూకు చెందిన మన్‌దీప్ సింగ్ (23)ను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసి వారిని ప్రశ్నించేందుకు ఢిల్లీకి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఎర్రకోట ఘటనలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారని ఢిల్లీ పోలీసు అధికారి అనిల్ మిట్టల్ చెప్పారు. కాగా.. తన భర్త ఎర్రకోటకు వెళ్లలేదని, ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసనలో పాల్గొన్నాడని, కాని పోలీసులు విచారణ పేరిట పిలిచి అరెస్టు చేశారని మోహిందర్ సింగ్ భార్య ఆరోపించారు. తన భర్తను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read: