ఢిల్లీకి చెందిన సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత (29) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె హత్య కేసులు పోలీసులు సంగీత స్నేహితులిద్దరి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిద్దరు సంగీతతో కలిసి గత కొద్ది కాలంగా పనిచేస్తున్న రవి, అనిల్ గా గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే సంగీతను హత్య చేశారని.. చనిపోవడానికి ముందు ఆమెకు చెరుకు రసంలో 10 మాత్రలు కలిపి ఇచ్చి.. ఆ తర్వాత ఆమె అపరస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత గొంతు నులిని హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు..
మే 11న సంగీత ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మూడు రోజులకు రోహతక్ మెహమ్ ప్రాంతంలో ఆమె శవమై కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెతో పాటు పనిచేసే రవి, అనిల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తామే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంగీత హత్యలో రవి అసలు సూత్రదారి అని పోలీసులు నిర్దారించారు. రవి సూచన ప్రకారం అనిల్ ఢిల్లీకి వచ్చి సంగీతను కారులో ఎక్కించుకుని మోహం వైపు వచ్చాడు. అదే దారిలో చెరుకు రసంలో 10 నిద్రమాత్రలు కలిపి ఆమెతో తాగించాడు.. ఆ తర్వాత.. హార్యానాలోని కలనౌర్ దగ్గరికి రాగానే వీరిని రవి కలిశాడు..
అనంతరం ముగ్గురు కలిసి అక్కడే సమీపంలోని గులాటి దాభాలో భోజనం చేశారు.. మోహం సమీపానికి రాగానే సంగీత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ప్లాన్ ప్రకారం ఆమె పీక నులిమి రవి హత్య చేశాడు.. తర్వాత ఆమెను మోహం సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. రిలేషన్ లో వచ్చిన మనస్పర్థల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. సంగీత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.