ఛీ.. ఛీ.. వీడసలు మనిషేనా.! ఫ్రంట్ సీట్ ఇవ్వలేదని ఏకంగా తండ్రినే..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వాహనంలోని ఫ్రంట్‌ సీటు కోసం తండ్రి, కొడకుల మధ్య చెలరేగిన వివాదం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య గొడవ తీవ్రతరం కావడంతో ఆగ్రహించిన కొడుకు తండ్రి లైసెన్స్‌డు తుపాకీ తీసుకొని అతన్నే కాల్చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.

ఛీ.. ఛీ.. వీడసలు మనిషేనా.! ఫ్రంట్ సీట్ ఇవ్వలేదని ఏకంగా తండ్రినే..
Delhi Crime

Updated on: Jun 28, 2025 | 4:36 PM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వాహనంలోని ఫ్రంట్‌ సీటు కోసం తండ్రి, కొడకుల మధ్య చెలరేగిన వివాదం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. వివరాళ్లోకి వెళితే. తిమార్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర సింగ్‌.. గతంలో CISFలో పని చేసి ఆరు నెలల క్రితం రిటైర్‌ అయ్యారు. ఇతనికి భార్య, 26 ఏళ్ల కుమారుడు దీపక్ ఉన్నారు. అయితే సురేంద్ర సింగ్ తన కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్‌లోని సొంత గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జూన్‌ 26వ తేదీ ఓ టెంపోను బుక్‌ చేసి.. దాంట్లోకి ఇంట్లోని సమాన్లను మొత్తం లోడ్‌ చేశారు. ఇక వాహనం వెళ్లడానికి సిద్దంగా ఉన్న సమయంలో వాహనం ముందు సీటులో కూర్చునే అంశంపై తండ్రి కొడుకుల మధ్య వివాదం చెలరేగింది.

వాహనంలో లగేజ్‌ ఉందని తాను ముందు సీటులో తాను కూర్చుంటానని.. కొడుకును వెనక్కి వెళ్లాలని సురేంద్ర సింగ్‌ సూచించాడు. దానికి దీపక్ నిరాకరించడంతో అతనిపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన దీపక్‌ వాహనంలోకి వెళ్లి తండ్రి లైసెన్స్‌డు తుపాకిని తీసుకొచ్చి సురేంద్ర సింగ్‌పై కాల్పులు జరిపాడు.

ఆదే సమయంలో పెట్రోలింగ్ విధుల్లో భాగంగా అటుగా వచ్చిన పోలీసులు కాల్పుల శబ్ధం విని వెంటనే ఘటనా స్థలనాకి చేరుకున్నారు. అక్కడ రక్తపు మడుగుల్లో ఉన్న సురేంద్రను చూసి.. ఎదురుగా నిలబడి ఉన్న దీపక్‌ చేసితో ఉన్న గన్‌ను లాక్కున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని వ్యాన్‌లోకి ఎక్కించారు. ఇక వెంటనే సురేంద్రను హాస్పిటల్‌కు తరలించారు. అయితే సురేంద్రను పరిశీలించిన వైద్యులు అతని అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..