Anandaya Medicine: బ్లాక్ మార్కెట్ లో ఆనందయ్య మందు.. టీవీ9 నిఘాకి చిక్కిన బ్లాక్ మార్కెట్ బ్యాచ్..!

అమ్మకానికి నమ్మకం. అవును, ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ మోసమూ ఉంటుంది. ఆనందయ్య మందు విషయంలో కూడా ఇప్పుడిదే జరుగుతోంది. ఆనందయ్య మందు ఉన్న డిమాండ్‌ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.

Anandaya Medicine: బ్లాక్ మార్కెట్ లో ఆనందయ్య మందు.. టీవీ9 నిఘాకి చిక్కిన బ్లాక్ మార్కెట్ బ్యాచ్..!
Anandaya Medicine Black Market Boom Survived In Tv9 String Operation

Updated on: May 24, 2021 | 1:16 PM

Anandaya Medicine Black Market Boom: అమ్మకానికి నమ్మకం. అవును, ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ మోసమూ ఉంటుంది. ఆనందయ్య మందు విషయంలో కూడా ఇప్పుడిదే జరుగుతోంది. ఆయనే మందు పంపిణీకి పర్మిషన్ కోసం చూస్తున్నారు. కానీ, ఈలోపు ఉన్న డిమాండ్‌ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. పదులు, వంద కాదు.. వేలకు వేలు దోచేస్తున్నారు. టీవీ9 నిఘాలో ఆ బ్లాక్ దందా బయటపడింది.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. మాయదారి రోగం నుంచి రక్షించుకునేందుకు అందివచ్చిన అవకాశాలన్నింటి కోసం బాధితులు ప్రసయత్నిస్తూనే ఉన్నారు. రెమ్‌డిసివర్‌ రోగాన్ని తగ్గిస్తోందనగానే బ్లాక్‌ మార్కెట్‌లో లక్షలు పలికింది. ఇప్పుడు ఆనందయ్య మందుకూ డిమాండ్ పెరగడంతో.. కృష్ణపట్నం పరిసరాల్లో బ్లాక్ మార్కెట్‌ ఓ రేంజ్‌లో నడుస్తోంది. మొన్న ఒకడు మూడు టీస్పూన్ల మందు.. ఒకరికి అంటగట్టి మూడువేలు నొక్కేశాడు. అదేమంటే అది ఆనందయ్య మందంటూ బాధితుల నమ్మకాన్ని అమ్ముకున్నాడు.

ఇక, ఇప్పుడు బయటపడ్డ బాగోతం అంతకంటే ఘనం. అక్షరాలా 50వేలకు కుదిరిన బేరం అది. ఆనందయ్య మందు కళ్లలో వేస్తే మరణశయ్యపై ఉన్నవాళ్లు లేచి కూర్చుంటున్నారన్న టాక్ రావడంతో జనం ఎగబడుతున్నారు. పంపిణీ ఆపేసినా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కానీ.. ఆ నమ్మకాన్నే క్యాష్ చేసుకోబోయాడు ఒక వ్యక్తి. కళ్లలో వేసుకునే నాలుగు చుక్కల మందు 50వేలకు బేరం పెట్టాడు. అమ్మకందారుకీ, బాధితుడికీ మధ్య కుదిరిన ఆ బేరం ఓ సారి విందాం..

ఫోన్‌లో ఎవరెవరో మాట్లాడుకుంటారు.. అంతమాత్రాన అదే నిజం అని మీరూ నమ్మాలని లేదు. అందుకే టీవీ9 స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది టీవీ9. వ్యవహారం తెలిసి నమ్మకాన్ని అమ్ముతున్న ఆ వ్యక్తి టవీ9 బ‌ృందాన్ని చూసి పరుగులు పెట్టాడు.

శివ అనే వ్యక్తి తన మిత్రుడి ద్వారా ఆనందయ్య మందుకోసం ప్రయత్నం చేశాడు. అతను నాగరాజు అనే మరో వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అతనికి కాల్ చేస్తే కుదిరిన బేరం అది. ఈ ఫోన్‌ కాల్ తర్వాత కూడా టీవీ9 అసలు ఏది నిజమో తెలుసుకునే ప్రయత్నం చేసింది. 50వేల నుంచి ఆ మాయగాడు.. 20వేలకు తగ్గాడు. ఎమర్జెన్సీలో భలే పనిచేస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ మొత్తం తతంగాన్ని టీవీ9 రికార్డ్ చేసింది.

టీవీ9 స్టింగ్‌ అని తెలిశాక.. ఇక ఆ మాయగాడు అక్కడి నుంచి పరుగో పరుగు పెట్టాడు. అతన్ని వెంబడించింది టీవీ9 టీం. స్థానికులు కూడా అడ్డగించి అతన్ని పట్టుకున్నారు. అసలు ఆ మందు ఆనందయ్య తయారు చేసిందో కాదోగానీ, అతని పేరు మీద, అతని గుడ్‌విల్‌ను వాడుకుని జరుగుతున్న వ్యాపారం ఇది. అసలే కరోనాతో చావుకు బతుకుకు మధ్య ఉన్న బాధితులను వాళ్ల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్న మహామాయ ఇది.

ఈ ఘటనపై పోలీసులు కూడా ఫోకస్ పెట్టారు. ఆనందయ్య మందుకు ప్రస్తుతానికి పర్మిషన్ లేదు. కానీ, జరుగుతున్న వ్యాపారం టీవీ9 కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై ఆరా తీస్తున్నాం.. ఈ వ్యవహారానికి సంబంధించి ఉన్నతాధికారులు చూసుకుంటారంటూ స్థానిక పోలీసులు తాపీగా చెబుతున్నారు.

Read Also…. Corona Medicine: కరోనాను అణిచివేసే కొత్త మందు..ఎలుకల్లో చేసిన ప్రయోగాలు సక్సెస్..శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు