రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, వాహనదారుల్లో క్రమశిక్షణ కోసం వినూత్న ఐడీయాలతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూపర్ అనిపించుకుంటున్నారు. తాజాగా వాళ్లెంత స్మార్టో కూడా నిరూపించుకున్నారు. పోలీసులు తనకు తప్పుడు చెలన్ వేశారంటూ ఓ టూ వీలర్ వాహనదారుడు ట్టిట్టర్‌లో ట్రాఫిక్ పోలీసులకు జర్క్ ఇచ్చాడు. తాను ట్రిపుల్ రైడింగ్ చేయకపోయినా.. ఫొటోను సరిగా చూసుకోకుండా తనకు ఫైన్ విధించారని తన బాధను చెప్పుకున్నాడు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ నుంచి పోలీసులు తీసిన ఫొటోను డౌన్ లోడ్ చేశాడు. దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ‘సార్.. నేను ట్రిపుల్ రైడింగ్ చేయలేదు. బైక్ మీద ఇద్దరమే ఉన్నాం. కావాలంటే ఫొటోను క్లోజ్‌గా చూడండి.’ అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశాడు.
Sir we were only two members riding on the bike.But police has issued me challan for triple riding.look closely sir we were only two.@HYDTP @CYBTRAFFIC pic.twitter.com/Wq3DMBBCzw
— Mohammad Mubeen (@The_Mubeens) June 26, 2019
అయితే, సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన స్మార్ట్‌నెస్‌తో కుర్రోడికి రివర్స్ పంచ్ ఇచ్చారు. ‘మీ రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. అందుకే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చలాన్ మారుస్తున్నాం. ట్రిపుల్ రైడింగ్ చలాన్ తీసేసి..హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నట్టు మార్చాం. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. హెల్మెట్ ధరించండి’ అని రీ ట్వీట్ చేశారు. దీంతో హైదరబాద్ పోలీసులు ఇస్మార్ట్ అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్లు.
Sir,
Your request has been considered and we have placed a request to change the violation from Triple riding to W/O helmet. Please follow traffic rules and always wear a helmet.— CYBERABAD TRAFFIC (@CYBTRAFFIC) June 26, 2019