Crime News: ఓయో రూమ్ బుక్ చేయాలనుకున్నాడు.. అడ్డంగా బుక్కైయ్యాడు.. లక్షలు పోగొట్టుకున్నాడు…

|

Apr 10, 2021 | 9:36 AM

Crime News Latest: టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరుగుతోంది. రోజుకో తరహా కొత్తరకం మోసాలకు పాల్పడుతూ...

Crime News: ఓయో రూమ్ బుక్ చేయాలనుకున్నాడు.. అడ్డంగా బుక్కైయ్యాడు.. లక్షలు పోగొట్టుకున్నాడు...
Oyo Room
Follow us on

Crime News Latest: టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరుగుతోంది. రోజుకో తరహా కొత్తరకం మోసాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్నారు. పలువురి అకౌంట్లపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు లక్షలను కొట్టేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఉమేష్ అనే ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఏకంగా రూ. 3.08 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పని చేస్తోన్న ఉమేష్ ‌కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత చికిత్స తీసుకోగా నెగటివ్ వచ్చింది. తన వల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఓయో రూమ్ తీసుకోవాలని భావించాడు.

బుక్ చేసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేయగా.. ఓ నకిలీ లింక్ ద్వారా సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కాడు. తాము పంపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. త్వరగా రూమ్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుందని నమ్మబలికించారు. ఇదే అదునుగా చేసుకుని అతడి ఫోన్‌లోని సమాచారాన్ని తస్కరించడమే కాకుండా.. అతడి బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ. 3.08 లక్షలను లూటీ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఉమేష్.. తాను మోసపోయినట్లుగా గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

Also Read:

Viral: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.

ఆ గ్రామంలో నివసించాలనుకునే వారికి ఇల్లు, కారు ఫ్రీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!

Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. ఈ బుద్దోడు ఇంతలా ఎలా సంపాదించాడంటే.!