Cyber Cheating : ఈ సారి నగరంలోని ఒక ఆయుర్వేద డాక్టర్ ని ట్రాప్ చేశారు సైబర్ చీటర్స్. ఆమె నుండి నలభై లక్షలు దోచేశారు. హైదరాబాద్ మెహిదీపట్నం కి చెందిన ఆయుర్వేద వైద్యురాలు శైలా తో ఒక పేషెంట్ గా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా పరిచయం చేసుకున్న జేమ్స్ మారియో అనే నైజీరియన్ ఇంతటి కుట్రకు పాల్పడ్డాడు. అమెరికా కంపెనీ కి మెడిసిన్ ఫార్ములా విక్రయిస్తే ఐదు కోట్లు ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చి ఆయుర్వేద డాక్టరమ్మను బుట్టలో వేసుకున్నాడు.
అతడి మాటలు నమ్మి ఉచ్చులో చిక్కుకుంది వైద్యురాలు. డాలర్స్ ఎక్స్ చేంజ్, ట్రాన్స్ఫర్ చార్జెస్ అంటూ పదే పదే నమ్మించి మూడు విడతలుగా రూ. 41 లక్షలు తన అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేయించుకుని తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసిన కేటుగాడు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన వైద్యురాలు సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు.
Read also : Bonalu Festival: బోనాల నిర్వహణపై మంత్రుల సమీక్ష.. కీలక ఆదేశాలు