Telangana Crime Rate:తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(NCRB) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. 2020 సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 12 శాతం నేరాలు పెరిగాయి. రాష్ట్రంలో గతేడాది మహిళపై లైంగిక వేదింపులకు సంబంధించి 4,907 కేసులు నమోదు అయ్యాయి. ఇలా మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, దోపిడీలు, వంటి కేసులు భారీగా నమోదు అయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో నేరాల వివరాలు..
రాష్ట్రంలో 2020 సంవత్సరంలో 12 శాతం నేరాలు పెరిగాయి.
వాటిలో మహిళల పై లైంగిక వేధింపుల కేసులు – 4,907
చిన్నారులపై లైంగిక దాడులు, పొక్సో కేసులు – 2,074
మహిళలపై దాడుల కేసులు – 2,520
హైదరాబాద్ వ్యాప్తంగా రేప్ కేసులు – 92
తెలంగాణ వ్యాప్తంగా రేప్ కేసులు – 764
బహిరంగంగా మహిళలను వేధించిన కేసులు – 21
సైబర్ స్టాకింగ్ ద్వారా మహిళల్ని వేధించిన వారిపై కేసులు – 1,436
చిన్నారుల మిస్సింగ్ కేసులు – 420
మహిళలు వరకట్న వేదింపులు తాలలేక ఆత్మహత్యకు పాల్పడిన కేసులు – 158
తెలంగాణ వ్యాప్తంగా హత్య కేసులు – 802
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు – 117
నిర్లక్ష్యం కారణంగా మరణించిన కేసులు – 7,564
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కేసులు – 7,226
హిట్ అండ్ రన్ కేసులలో మరణించిన వారు – 1,365
మహిళలపై యాసిడ్ దాడి కేసులు – 5
ముఖ్య గమనిక:ఈ కేసులన్నీ ఒక్క 2020 సంవత్సరంలో నమోదైనవి మాత్రమే.