Chittoor SP Senthil Kumar: సోషల్ మీడియాలో పలువురు ప్రముఖుల నకిలీ అకౌంట్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల చాలా మంది ప్రముఖులు, అధికారులు ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నకిలీ ఖాతాలను సృష్టించి నిందితులు డబ్బులు కావాలంటూ మెస్సెజ్‌లు చేస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా చిత్తూరు జిల్లా ఎస్పీకి సైతం ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. చిత్తూరు ఎస్పీ పేరుతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. ఎస్పీ సెంథిల్ కుమార్ ఫోటోతో ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి వీకోటకు చెందిన సునీల్ అనే యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. అనంతరం యాక్సెప్ట్ చేసిన సునీల్‌తో ఆ ఖాతా నుంచి సందేశాలు వచ్చాయి.
ఈ క్రమంలో సునీల్ నకిలీ ఖాతా అని తెలియకుండా మెస్సెజ్‌లు చేశారు. ఈ క్రమంలో నకిలీ ఖాతా నుంచి గూగుల్ పే ఉందా అంటూ చాటింగ్ చేశారు. స్నేహితుడికి ఆక్సిడెంట్ అయిందంటూ ఒక ఫోటోను పోస్ట్ చేసి 15 వేల రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేయాలని ఫేక్ అకౌంట్ ఖాతాదారుడు కోరాడు. అనుమానం వచ్చిన సునీల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫేస్ బుక్ అకౌంట్ నకిలీదని గుర్తించారు. ఎస్పీ పేరుతో ఆగంతకుడు క్రియేట్ చేసిన ఫేస్ బుక్ అకౌంట్‌పై పోలీసులు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అకౌంట్ నుంచి ఎవరెవరికి.. మెస్సెజ్‌లు పంపించాడు.. ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశాడు అన్న కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: