SI Beating Woman – Viral Video: మహిళ అని చూడకుండా.. ఓ ఎస్సై దారుణంగా ప్రవర్తించాడు. ఆ మహిళను కింద పడేసి.. ఆమెపై కూర్చొని దారుణంగా కొట్టాడు. ఈ అమానవీయ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని కాన్పూర్ డెహత్ జిల్లా దుర్గాదాస్‌పూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దుర్గాదస్‌పూర్‌లో ఇటీవల ఓ వ్యక్తిని భోగిన్‌పూర్ ఎస్సై మహేంద్ర పటేల్ అరెస్టు చేశాడు. అయితే ఆయనను విడిచిపెట్టాలంటే లంచం ఇవ్వాలని అడుగుతున్నారని బాధిత మహిళ పేర్కొంది. ఇవ్వనని చెప్పడంతో తనను కింద పడేసి కొట్టాడని, మీద కూర్చుని ముఖం మీద దాడి చేశాడని ఆరోపించింది. అనంతరం గ్రామస్తుల జోక్యంతో తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ ఆవేదన వ్యక్తంచేసింది.
దుర్గాదస్‌పూర్‌లో స్నేహితులతో కలిసి శివం యాదవ్ అనే వ్యక్తి జూదం ఆడుతుంటే అరెస్టు చేశామని ఎస్సై తెలిపాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించి.. తన బృందంపై దాడి చేశారని ఎస్సై పటేల్ పేర్కొన్నాడు. ఈ ఘటనపై కాన్పూర్ ఎస్పీ చౌదరి స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. పటేల్‌ను భోగిన్‌పూర్ విధుల నుంచి తప్పించామని, ఘటనపై దర్యాప్తు చేయించి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై విపక్షాలు.. యోగి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తంచేశాయి.
వీడియో..
महिला: “दारोग़ा ने उससे बदतमीज़ी की।”
पुलिस : “महिला ने पुलिस से बदतमीज़ी की।उसका कॉलर खींचा तो वह गिर गया।”कानपुर देहात का मामला।दारोग़ा को लाइनहाजिर कर जांच हो रही है। pic.twitter.com/5IUvGN6MIE
— Kamal khan (@kamalkhan_NDTV) July 17, 2021
Also Read: